జాతీయ వార్తలు

మోదీకి అఫ్గాన్ అత్యున్నత పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హెరత్, జూన్ 4: అఫ్గానిస్థాన్‌లో ఒక రోజు పర్యటనకోసం శనివారం వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన అమీర్ అమానుల్లా ఖాన్ పురస్కారంతో సత్కరించారు. హెరత్ రాష్ట్రంలోని చిస్తీ-ఎ-షరీఫ్ వద్ద చరిత్రాత్మకమైన అఫ్గాన్-ఇండియా ఫ్రెండ్‌షిప్ డ్యామ్‌ను ప్రారంభించిన అనంతరం అఫ్గాన్ అధ్యక్షుడు అషఫ్ ఘనీ ప్రధాని మోదీని ఈ పురస్కారంతో సత్కరించారు. దాదాపు 25 నిమిషాల ప్రసంగంలో మోదీ సూఫీ సన్యాసి ఖాజా మొయినుద్దీన్ చిస్తీని గుర్తు చేసుకున్నారు. అనంతరం అఫ్గాన్ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

చిత్రం తమ దేశ అత్యున్నత పురస్కారంతో మోదీని సత్కరిస్తున్న అఫ్గాన్ అధ్యక్షుడు అషఫ్ ఘనీ