అంతర్జాతీయం

తీరని నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మియామీ, సెప్టెంబర్ 11: భయానక ప్రకృతి విలయం ఇర్మా హరికేన్ ఫ్లోరిడాను గడగడలాడించింది. తీరాలను ఛిద్రం చేసింది. భయానక వేగంతో కూడిన పెనుగాలుల తాకిడికి చెట్లు కొట్టుకు పోయాయి. క్షణాల్లో ఓ బీభత్స దృశ్యం తాండవించింది. ప్రపంచ గాలులతో పాటు ప్రళయాన్ని తలపించే రీతిలో తలెత్తిన వరదల తాకిడికి ఇళ్లు, రోడ్లు మునిగిపోయాయి.మియామీలో అయితే భారీ క్రేనే్ల నేలకొరిగాయి. ఏకంగా 640 కిలోమీటర్ల వెడల్పు కలిగిన ఇర్మా హరికేన్ పెను వేగానికి ఏదీ తాళలేక నేలకొరిగింది. ఇప్పటికే ఫ్లోరిడా కీస్‌లో వేలాదిగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ప్రాణ నష్టం తప్పింది. చివరి క్షణంలో హరికేన్ తీవ్రత తగ్గినప్పటికీ దాని విధ్వంస స్థాయి మారలేదు. ఇది దిశ మార్చుకోవడం తమకు కొంత ఊరట కలిగించిందని చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహాయ చర్యల్ని యుద్ధ ప్రాతిపదికన చేపడతామన్నారు. హరికేన్ పెనుగాలుల తీవ్రతకు పశ్చిమ పామ్ బీచ్, మియామీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏ క్షణంలోనైనా తక్కువ
తీవ్రతతో తంపాను ఇది తాకే అవకాశం ఉందంటూ హెచ్చరికలు అందుతున్నాయి. కేటగిరీ-4 తీవ్రత కలిగిన హరికేన్‌గా ఇర్మా ఫ్లోరిడా తీరాలను తాకినప్పటికీ అనంతరం గంటకు 177 పెను గాలుల తీవ్రత కలిగిన కేటగిరీ-2 హరికేన్‌గా బలహీన పడింది. అయినా దీని విధ్వంస తీవ్రత తగ్గలేదు. ‘నష్టం జరుగకూడదని ప్రార్థించండి’అని విజ్ఞప్తి చేసిన ఫ్లోరిడా గవర్నర్ రిక్ స్కాట్ ముందస్తుగానే రాష్ట్రం నుంచి లక్షన్నర మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ఈ ప్రకృతి విలయానికి ఎంత మంది మరణించారన్నదానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. దిగువన ఉన్న కీస్ ప్రాంతంలో అలలు ఎగిసి పడ్డాయి. దాదాపు మూడు మీటర్ల ఎత్తుకు ఎగిసిన వీటి ప్రభావానికి ఇళ్ల నుంచే వస్తువులు బయటికి కొట్టుకొచ్చాయి. తమ రాష్ట్రంపై ఇర్మా ప్రభావం ఎంత, ఎంత మేర ఆస్తుల విధ్వంసం జరిగిందన్న దానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని మాన్రో కౌంటి అధికారి ఒకరు తెలిపారు. హరికేన్ తీవ్రత తగ్గడంతో అది తుపాను స్థాయికి చేరుకున్నా దాని ప్రభావం మాత్రం హరికేన్ స్థాయి తగ్గలేదని అధికారులు తెలిపారు. జార్జియా దిశగా కూడా ఇది దూసుకెళ్లే అవకాశం ఉందన్న సంకేతాలూ వ్యక్తమవుతున్నాయి. సహాయ బృందాలను పెద్ద ఎత్తున రంగంలోకి దింపినప్పటికీ అన్ని ప్రాంతాలు జలమయం కావడం వల్ల ఈ చర్యలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. చిన్న పడవల్ని ఉపయోగించుకుని మరి ఇంటింటికీ వెళుతున్న సహాయ బృందాలు అందిన వారిని అందినట్టుగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

చిత్రం..ఛిద్రమైన ఫ్లోరిడా పరిస్థితికి దర్పణం ఈ చిత్రం