అంతర్జాతీయం

రోహింగ్యాలకోసం మరో శిబిరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాక్స్‌బజార్ (బంగ్లాదేశ్), సెప్టెంబర్ 11: రోహింగ్యా ముస్లింలకు ఆశ్రయం కల్పించేందుకు బంగ్లాదేశ్ ముందుకొచ్చింది. మైన్మార్‌లో హింస భరించలేక వేలాది మంది రోహింగ్యా బాధితులు బంగ్లాదేశ్‌కు పారిపోయి వచ్చిన సంగతి తెలిసిందే. వారికోసం శిబిరం ఏర్పాటు చేయడానికి ఉచితంగా స్థలం ఇస్తామని బంగ్లాదేశ్ ప్రకటించింది.
బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లా కాక్స్‌బజార్‌లో కొత్త శిబిరం ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించిందని ఓ సీనియర్ అధికారి సోమవారం ఇక్కడ వెల్లడించారు. గత నెల 25 నుంచి ఇప్పటివరకూ మూడు లక్షల మంది రోహింగ్యా బాధితులు బంగ్లాదేశ్‌కు తరలివచ్చారని ఆయన అన్నారు. ‘ఇప్పటికే ఉన్న రెండు శరణార్థుల శిబిరాలు బాధితులతో కిక్కిరిసిపోయాయి’ అని ఐరాస శరణార్థి సంస్థ అధికార ప్రతినిధి వివియన్ టాన్ తెలిపారు. మైన్మార్ నుంచి రోహింగ్యాలు తరలిరావడం కొనసాగుతునే ఉందని, వారందరికీ స్కూళ్లు, తాత్కాలిక శిబిరాల్లో ఆశ్రయం కల్పిస్తున్నట్టు ఆమె చెప్పారు. మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు ఆమె పేర్కొన్నారు. అంతేకాదు ఆహారం, శుభ్రమైన నీళ్లు, వైద్య సదుపాయం అందక అలమటిస్తున్నట్టు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. షాహా పురి ద్విప్ సరిహద్దు వద్ద సోమవారం వందలాది మంది శరణార్థులు వచ్చారని అన్నారు. ఇరవై వేల మందికి సహాయ సామగ్రి మంగళవారం అందుతుందని భావిస్తున్నట్టు టాన్ చెప్పారు. కుతుప్లాంగ్‌లో ఇప్పుడున్న శిబిరానికి అదనంగా మరొక దాన్ని ఏర్పాటు చేయడానికి రెండెకరాల స్థలం ఇవ్వడానికి ప్రధాని షేక్ హసీనా అంగీకరించారు.
బాధితులను ఆశ్రయం కల్పించడానికి ప్రధాని సముఖత వ్యక్తం చేశారని బంగ్లా విదేశాంగ శాఖ సహాయ మంత్రి మహ్మద్ షహారియార్ అలాం తన ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. షేక్ హసీనా మంగళవారం రోహింగ్యా బాధితులను పరామర్శించనున్నారు. కాక్స్‌బజార్‌లోని ప్రభుత్వం ఆసుపత్రి రోహింగ్యా బాధితులతో నిండిపోయింది. బులెట్ గాయాలు, ఇన్‌ఫెక్షన్లతో ఆసుపత్రికి బారులు తీరుతున్నారు.