అంతర్జాతీయం

ముమ్మరంగా సహాయక చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, సెప్టెంబర్ 11: ధ్వంసమైన కరేబియా దీవుల్లో సహాయక చర్యలు ముమ్మర ప్రాతిపదికన మొదలయ్యాయి. ఇక్కడి వ్యాహ్యాళి కేంద్రాల్లో చిక్కుకుపోయిన వేలాది మంది టూరిస్టులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఫ్రాన్స్, నెదర్‌లాండ్స్ రంగంలోకి దిగాయి. ఇప్పటికే దాదాపు 400 మందిని ఈ ప్రాంతాల నుంచి తరలించారు. అయితే ఇప్పటికే పూర్తికావాల్సిన సహాయక చర్యలు ఇంకెంతకాలం సాగుతాయన్న దానిపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ దీవులు అటు ఫ్రాన్స్‌కు, అటు నెదర్‌లాండ్స్‌కు మధ్య ఉండటంతో సహాయక చర్యలకు సంబంధించి ఇరు దేశాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకున్నాయి. కాగా హరికేన్ తాకిడికి క్యూబాలో పదిమంది మరణించారు. హవానా సహా అనేకచోట్ల ఈ మరణాలు సంభవించినట్లు అధికారికంగా వెల్లడించారు. ఇర్మా హరికేన్ అమెరికాను హడలెత్తిస్తున్న నేపథ్యంలో ఎక్కడ కొంప ముంచుకొస్తుందోనన్న భయంతో సహాయక చర్యలతో తైవాన్ సన్నద్ధం అవుతోంది. ఇప్పటికే ముంపుకు గురయ్యే ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనేక విమానాలను రద్దు చేశారు. అయితే ఇక్కడ నిర్మా హరికేన్ కాకుండా తాలిమ్ అనే మరో పెనుతుపాను తీరాన్ని తాకే అవకాశం ఉండటంతో తైవాన్ చాలా గంటల ముందే ఈ సహాయక చర్యలను చేపట్టింది. దాదాపు అన్ని నదులపైన, ప్రాంతాలపైన దృష్టి ప్రమాద సంకేతాలు తలెత్తితే సహాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. ప్రతి ఏటా తైవాన్ ఈ రకమైన తుపాన్ల తాకిడికి గురవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నష్టం వచ్చిన తర్వాత సహాయ చర్యలు చేపట్టేకంటే ముందుగానే సంసిద్ధం కావడం అన్న ఆలోచనతోనే తైవాన్ సన్నద్ధం అవుతోంది. ఇదిలావుండగా, ఇర్మా తుపాను కారణంగా నష్టపోయిన వారిని ఆదుకోవడానికి అట్లాంటా, జార్జియా రాష్ట్రాల్లోని ప్రవాస భారతీయులు నిధులను సేకరించారు. ఇప్పటికే ఫ్లోరిడాలో వేలాది మంది నిరాశ్రయులు కావడంతో వారందరినీ ఆదుకునేందుకు ఈ రెండు రాష్ట్రాల్లోని భారతీయులు చేతులు కలిపారు.
ఒక్క ఫ్లోరిడాలోనే లక్షా 20 మంది ప్రవాస భారతీయులు నివసిస్తున్నారు. ఇప్పటికే ఫ్లోరిడానుంచి బయటపడ్డ వేలాది మంది భారతీయులు సమీపంలోని అట్లాంటాలో నివసిస్తున్న తమవారి ఆశ్రయాన్ని కోరారు. ఈ సహాయ చర్యలు అమెరికాలోని భారత రాయబారి నవతేజ్ శర్మ పర్యవేక్షణలో జరుగుతున్నాయి.

చిత్రం..ఇర్మా హరికేన్ తాకిడికి ధ్వంసమైన కరేబియన్ దీవుల్లోని విర్జిన్ ఐల్యాండ్