అంతర్జాతీయం

అమెరికాలో రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 11: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రెండు వారాల పాటు అమెరికాలో పర్యటన నిమిత్తం ఇక్కడకు చేరుకున్నారు. అమెరికాలో పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులతో రాహుల్ భేటీ కానున్నారు.
అలాగే ఎన్నారైలను కలుసుకుని పార్టీ పటిష్టానికి తీసుకోవల్సిన చర్యలపై వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. ప్రఖ్యాత కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి కాంగ్రెస్ నేత ప్రసంగిస్తారు. యూనివర్శిటీలో రాహుల్ సభ జరిగే వేదిక కెపాసిటీ నిండిపోవడంతో రిజిస్ట్రేషన్లు నిలిపివేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయం వద్ద రాహుల్‌గాంధీకు ఘనస్వాగతం లభించింది. సీనియర్ కాంగ్రెస్ నేతలు శాన్‌పిట్రోడా, సౌధ్‌సింగ్ స్వాగతం పలికారు. ఇండియన్ నేషనల్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐఎన్‌ఓసి) అధ్యక్షుడిగా సింగ్ కొనసాగుతున్నారు. బర్కీలీలోని కాలిఫోర్నియా యూనివర్శీటీని 1949లో ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సందర్శించారు. భారత్‌లో ప్రజాస్వామ్యానికి, సెక్యులరిజానికి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో రాహుల్ పర్యటన ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుందని పార్టీ అధికార ప్రతినిధి మధుయాష్కీ వెల్లడించారు. ఎన్నారైలతో యువనేత భేటీ అవుతారని ఆయన అన్నారు.
శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి రాహుల్ లాస్‌ఏంజిల్స్ వెళ్తారు. యాస్పెన్ ఇనిస్టిట్యూట్‌లో మేధావి వర్గంలో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. వాషింగ్టన్ డిసిలో ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులతో రాహుల్ సమావేశమవుతారు.