అంతర్జాతీయం

బాధితులను ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 11: ఇర్మా హరికేన్ కారణంగా తలెత్తిన బీభత్సాన్ని ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని, ఇందుకోసం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా సంసిద్ధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భయానక గాలులు, వానతో ఫ్లోరిడా తీరాలను ఇర్మా హరికేన్ చుట్టేయడంతో తీవ్రస్థాయిలోనే నష్టం వాటిల్లింది. బాధితులను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హార్వీ హరికేన్ విపత్తు నుంచి కోలుకోకుండానే ఈ రెండో భయానక పెనుతుపాను అమెరికాను చుట్టుముట్టిందని ట్రంప్ తెలిపారు. 9/11 సంస్మరణ దినోత్సవం సందర్భంగా పెంటగాన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్ ‘రెండు బీభత్స తీవ్రత కలిగిన హరికేన్లు చుట్టుముట్టిన అమెరికా కోలుకోగలిగింది. బాధితులను అన్ని విధాలా ఆదుకునేందుకు నా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఫ్లోరిడాతోపాటు అల్బామా, జార్జియా, టెక్సాస్ రాష్ట్రాల్లోని బాధితులను ఆదుకుంటామన్నారు. ‘ఒకే అమెరికా.. మనందరి మాట ఒక్కటే.. ఇది ఆపద సమయం.. ఎంతగా చేతులు కలిపితే అంతగా శక్తిమంతం అవుతాం. ఎలాంటి భయం లేకుండా నిబద్ధతతో ఈ సవాల్‌ను అధిగమించగలుగుతాం’ అని తెలిపారు. ఇర్మా హరికేన్ చివరిక్షణంలో దిశ మార్చుకోవడం పట్ల తాము బతికిపోయామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. హరికేన్ తూర్పు తీరం దిశగా కాకుండా ఫ్లోరిడాలోని పశ్చిమ తీరం దిశగా సాగడం వల్ల ఈ ఊరట కలిగిందన్నారు. దీని తీవ్రత కూడా చివరి క్షణలో కొంతమేర తగ్గడం వల్ల విధ్వంస స్థాయి కూడా ఊహించినంతగా ఉండకపోవచ్చునని పేర్కొన్నారు.

చిత్రం..ఇర్మా హరికేన్ తీవ్రతకు నీట మునిగిన ఫ్లాలోని జాక్సన్‌విల్లె