అంతర్జాతీయం

9/11 మృతులకు అమెరికన్ల నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 11: ఓ పక్క ప్రకృతి విలయాలతో అల్లాడిపోతున్న అమెరికా 9/11 మృతులకు ఘన నివాళుల్పించింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై 16 ఏళ్ల క్రితం జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన ఆప్తులు, బంధువులకు అంజలి ఘటించేందుకు వేలాది మంది పౌరులు సోమవారం గ్రౌండ్ జీరోకు చేరుకున్నారు. ప్రపంచానే్న గడగడలాడించిన 9/11 ఉగ్రదాడిని తలచుకుని మళ్లీ అలాంటి దారుణ ఘటన పునరావృతం కాకూడదని కోరుతూ పౌరులు ప్రార్థనలు చేశారు. కొవ్వొత్తులు వెలిగించి మృతులకు శ్రద్ధాంజలి తెలిపారు. పేలుళ్ల జరిగిన ఈ ప్రాంతంలో నిశ్శబ్దవాతావరం నెలకొంది. కుటుంబ సభ్యులను కోల్పోయినవారు వౌనంగా రోదించారు. పేలుళ్లలో కుప్పకూలిపోయిన జంట భవనాల వద్ద కొవ్వొత్తులు వెలిగించారు. పేలుళ్లలో చనిపోయిన వారిని గుర్తుచేసుకుంటూ, వారి పేర్లు రాసి ప్లకార్డులు పెట్టారు.
‘మీరు మా మధ్య లేకపోయినా మీ జ్ఞాపకాల్లోనే జీవిస్తున్నాం’ అంటూ కుటుంబ సభ్యులు ఆవేదన చెందారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన విమాన దాడిలో సుమారు 3వేల మంది మృతిచెందారు. 2001 సెప్టెంబర్ 11న ఈ ఘోరకలి చోటుచేసుకుంది. దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశ ప్రజలకు ఓ సందేశం ఇస్తూ ఉగ్రవాద మహమ్మారిపై పోరుకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదం ప్రపంచానికే పెనుసవాల్‌గా మారిందన్న ఆయన ఉమ్మడిగా దాన్ని తుదముట్టించాలని అన్నారు. 9/11 బాధితులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పెంటగాన్‌లో జరిగే సంస్మరణ కార్యక్రమానికి ట్రంప్ సతీసమేతంగా హాజరయినట్టు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. రక్షణశాఖ కార్యదర్శి జిమ్ మట్టీస్, త్రివిధ దళాల అధినేత జనరల్ జోసెఫ్ డన్‌ఫోర్డ్ హజరయ్యారు. షాంక్సిల్వేలో జరిగే సంస్మరణ కార్యక్రమానికి ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, దేశ అంతరంగిక శాఖ మంత్రి రేయాల్ జింకే హాజరయ్యారు.

చిత్రం..పెంటగాన్‌లో 9/11 మృతులకు నివాళులర్పిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్