అంతర్జాతీయం

వారసత్వ రాజకీయాలు సహజమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 12: భారత్‌లో రాజకీయాలు మొదలుకొని, వ్యాపారాల వరకు అన్ని రంగాల్లోనూ వారసత్వాలు సర్వ సాధారణమేనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. అయితే పూర్వీకులనుంచి సంక్రమించిన దానికన్నా ఒక వ్యక్తి సామర్థ్యం ముఖ్యమని స్పష్టం చేశారు. బర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్శిటీలో ‘ఇండియా ఎట్ 70: రిఫ్లెక్షన్స్ ఆన్ ది పాత్ ఫార్వర్డ్’ అనే అంశంపై చేసిన ప్రసంగంలో రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ విచ్ఛిన్న రాజకీయాలకు పాల్పడుతున్నారని, జమ్మూ, కాశ్మీర్‌లో ఉగ్రవాదం పెచ్చుమీరడానికి అవకాశమిస్తున్నారని, దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ కోరితే తాను కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడానికి సిద్ధంగానే ఉన్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలతో ముడిపడి ఉందా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, భారతదేశం వారసత్వంతోనే నడుస్తోందని ఆయన వాదించారు. ‘చాలా పార్టీల్లో ఆ సమస్య ఉంది. అఖిలేశ్ యాదవ్, స్టాలిన్ (కరుణానిధి కుమారుడు) కూడా వారసత్వ రాజకీయాలనుంచి వచ్చినవారే. అంతెందుకు అభిషేక్ బచ్చన్ కూడా వారసత్వంనుంచి వచ్చినవారే. అందువల్ల నా ఒక్కడి వెంటే పడకండి. చివరికి అంబానీలు, ఇన్ఫోసిస్‌లాంటి వ్యాపార సంస్థలు కూడా అదే విధంగా నడుస్తున్నాయి’ అంటూ పేరుమోసిన కుటుంబాలనుంచి వచ్చిన పలువురు భారతీయుల పేర్లను ఆయన ఉటంకించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో వారసత్వ రాజకీయాలనుంచి రానివారు కూడా చాలామంది ఉన్నారని రాహుల్ చెప్పారు. అయితే ఆ వ్యక్తి నిజంగా సమర్థుడా కాదా అనేదే ముఖ్యం అని ఆయన అన్నారు. 2012 ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజలతో సంబంధాలను కొనసాగించడం నిలిపివేశారని రాహుల్ అన్నారు. పదేళ్లపాటు అధికారంలో ఉండే ఏ పార్టీకయినా కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని ‘2004లో రూపొందించిన విజన్ 2010-11 వచ్చేసరికల్లా పని చేయడం మానేసింది. 2012 వచ్చేసరికి కొంత అహంభావం కూడా పార్టీలో చోటుచేసుకుంది. వాళ్లు ప్రజలతో సంబంధాలు పెట్టుకోవడం మానేశారు.. 2014 ఎన్నికల్లో పార్టీ ఓటమికి ప్రధాన కారణం అదే’నని రాహుల్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారా అన్న ప్రశ్నకు ‘నేను అందుకు పూర్తి సిద్ధంగా ఉన్నాను.. మా పార్టీకి సంస్థాగత ఎన్నికలున్నాయి. పార్టీ ఆ నిర్ణయం తీసుకోవాలి’ అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పాలనలో చేపట్టిన కార్యక్రమాలనే చాలావరకు బిజెపి అమలు చేస్తోందని రాహుల్ గాంధీ చెప్పుకొన్నారు. ‘మూల స్వరూపాన్ని వాళ్లు మానుంచే తీసుకున్నారు. అయితే అది పని చేయడం లేదు. ఎందుకు పని చేయడం లేదో మాకు తెలుసు’ అని ఆయన అన్నారు. మహాత్మాగాంధీ ఆలోచన అయిన అహింసా విధానం ఇప్పుడు భారతదేశంలో దాడికి గురవుతోందని రాహుల్ అన్నారు. ఈ అహింసా విధానమే దేశ ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చిందనే విషయాన్ని మరిచిపోకూడదని కూడా ఆయన అన్నారు. అయితే ఇప్పుడు బిజెపి విభజన రాజకీయాలను అమలు చేస్తోందని, దేశంలోని వివిధ మతాలు, వర్గాల మధ్య విద్వేషాలను సృష్టిస్తోందని, భారత దేశానికి ఇది కొత్త అని, చాలా ప్రమాదరకమని కూడా అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ విదేశాంగ విధానాన్ని కూడా రాహుల్ తప్పుబట్టారు. అమెరికాతో సంబంధాల విషయంలో వారి వైఖరితో తాను ఏకీభవిస్తున్నానని, ఉపఖండంలోని పొరుగు దేశాలతో సంబంధాల విషయంలో భారత్ ఏకాకిగా మారుతోందని, ఆ దేశాల్లో చైనా ప్రాబల్యం పెరుగుతోందని, ఇది ప్రమాదకరమని కూడా ఆయన అన్నారు.