అంతర్జాతీయం

సమస్యల పరిష్కారానికి.. ప్రాంతీయ భద్రతా వ్యవస్థ అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, జూన్ 4: ఇండో- పసిఫిక్ ప్రాంతంలో సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి, బలప్రయోగం, ఇతర ముప్పులనుంచి ఎదుర్కోవడానికి ఒక ప్రాంతీయ భద్రతా వ్యవస్థ అవసరమని భారత్ అభిప్రాయ పడింది. శనివారం ఇక్కడ 15వ షంగ్రీ-లా సదస్సునుద్దేశించి మాట్లాడుతూ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఈ పిలుపునిచ్చారు. ఈ ప్రాంతానికి ఇప్పటికీ ప్రధాన ముప్పుగా ఉన్న ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అన్ని దేశాలు కలిసికట్టుగా కృషి చేయాలని కూడా ఆయన అన్నారు. ‘మన ప్రాంతంలోని భద్రతా వ్యవస్థ ఇప్పటికీ ఉగ్రవాదంపట్ల అవసరమైనంత దృష్టి పెట్టడం లేదు. ఇది మారాల్సిన అవసరముంది’ అని పారికర్ అన్నారు.ఉగ్రవాదం, పైరసీ, ప్రకృతి విపత్తులలాగానే సముద్ర రవాణాకు ఎదురవుతున్న ముప్పులను ఎదుర్కోవడానికి కూడా ఉమ్మడి చర్య, సహకారం అవసరమని ఆయన అంటూ, ఇలాంటి సహకారం వల్ల పరస్పర విశ్వాసం, నమ్మకం పెరుగుతాయన్నారు. ఉగ్రవాదాన్ని నాశనం చేయడానికి ప్రతి ఒక్కరూ దృఢసంకల్పంతో కృషి చేయాలని ఆయన అంటూ, ప్రపంచంలో అన్ని చోట్లా ఉగ్రవాదాన్ని మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరముందన్నారు.
ఈ ప్రాంతంలోని వివాదాలు అత్యంత సున్నితమైనవని, వీటి కారణంగా ఉద్రిక్తతలు సైతం పెరుగుతున్నాయని పారికర్ అంటూ, ఈ ప్రాంతం అభివృద్ధి కోసం భారత దేశం తీసుకుంటున్న చర్యలను వివరించారు. బ్లూ ఎకానమీ ప్రయోజనాలను పూర్తిగా పొందడం కోసం తాము సముద్ర ప్రాంత పొరుగుదేశాలతో ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకుంటున్నట్లు ఆయన అన్నారు. సూయజ్ కాలువ తూర్పు ప్రాంతం మొదలుకొని ఆసియా పసిఫిక్ తీరప్రాంతాల దాకా ఉన్న ఇండో-పసిఫిక్ ప్రాంతం రాబోయే కాలంలో ప్రపంచ అభివృద్ధికి చోదక శక్తిగా ఉంటుందనడంలో తనకు ఎలాంటి అనుమానం లేదని పారిక్కర్ అన్నారు.