అంతర్జాతీయం

ఉత్తర కొరియాను కట్టడి చేయాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 15: క్షిపణి పరీక్షలతో అమెరికా సహా పలుదేశాల కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ఉత్తర కొరియాపై ఐరాస తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనేక దేశాలు అడ్డుచెబుతున్నా హైడ్రోజన్ బాంబు పరీక్షించిన ఉత్తర కొరియా తాజా క్షిపణి పరీక్షపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ ఘాటుగా స్పందించారు. ఎలాగైనా ఉత్తరకొరియా దూకుడుకు కళ్లెం వేయాలని నిర్ణయించారు. వచ్చే వారంలో జరిగే జనరల్ అసెంబ్లీ సమావేశంలో దీనిపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు శుక్రవారం ఆయన ప్రకటించారు. ఐరాస భద్రతా మండలి తీర్మానాన్ని పెడచెవిన పెట్టి మరీ ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలకు దిగడంపై ఆంటోనియో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని ఐరాస అధికార ప్రతినిధి వెల్లడించారు. ‘ఉత్తర కొరియా చర్యలు అశాంతికి దారితీస్తున్నాయి. ఇప్పటికైనా విరమించుకోవాలి’ అని ఐరాస చీఫ్ హెచ్చరించారు. వచ్చేవారం జరిగే సాధారణ సభలో దీనిపై చర్చించనున్నట్టు ఆయన ప్రకటించారు. జపాన్ మీదుగా పసిఫిక్‌లోకి శుక్రవారం ఉత్తర కొరియా ఓ బాలిస్టిట్ క్షిపణిని పరీక్షించింది.