అంతర్జాతీయం

మా వద్దా అస్త్రాలున్నాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 16: ఉత్తర కొరియాను ఎదుర్కొనేందుకు తమ వద్ద అనేక అస్త్రాలున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఉత్తర కొరియా తాటాకు చప్పుళ్లకు అమెరికా, మిత్ర దేశాలు భయపడిపోయే పరిస్థితుల్లో లేవని ఆయన స్పష్టం చేశారు. జపాన్ మీదుగా ఉత్తర కొరియా శుక్రవారం క్షిపణిని పరీక్షించిన నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఐరాస భద్రతా మండలి తీర్మానాలను ఏమాత్రం పట్టించుకోని ఉత్తర కొరియా పసిఫిక్ మహాసముద్రంలోకి బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగించింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ను ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఉత్తర కొరియాను కట్టడి చేయడానికి తమ వద్ద అనేక ఐచ్ఛికాలున్నాయని ట్రంప్ హెచ్చరించారు. అంతకుముందే ఐరాస భద్రతా సలహాదారు హెచ్‌ఆర్ మెక్‌మాస్టర్ క్షిపణి పరీక్షపై స్పందించారు. అమెరికా వైమానిక దళ 70 వార్షికోత్సవంలో ఉద్యోగులను ఉద్దేశించి అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ ‘మమ్మల్ని బెదిరించాలని ప్రయత్నించేవారి నుంచి ప్రజలను, దేశాన్నీ, నాగరికతను కాపాడుకుంటాం’ అని వెల్లడించారు. ఉత్తర కొరియా లేదా మరోదేశం బెదిరిస్తే అమెరికా మిత్ర దేశాలూ ఏ మాత్రం భయపడిపోవుఅని ఉద్ఘాటించారు. మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా దాన్ని పూర్తిగా సమర్థించుకుంది. దీనివల్ల ఉత్తర అమెరికాకు ఎలాంటి ప్రమాదం ఉండదని ఎయిరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ ప్రకటించింది. అలాగే అమెరికా రక్షణ శాఖ మంత్రి జేమ్స్ మట్టీస్ జపాన్ రక్షణ మంత్రి వొనేడెరాతో ఫోన్లో సంభాషించారు. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షతో తలెత్తిన పరిణామాలను ఇరుదేశాల రక్షణ మంత్రులు మాట్లాడుకున్నారని పెంటగాన్ వర్గాలు వెల్లడించాయి. జపాన్, సరిహద్దు, ప్రాంతీయ భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని జపాన్‌కు భరోసా ఇచ్చినట్టు అమెరికా తెలిపింది. ఉత్తర కొరియా చర్యలను తీవ్రంగా ఖండించిన ఇరుదేశాల రక్షణ మంత్రులు శాంతిని నెలకొల్పడానికి సమష్టిగా ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్టు రక్షణ శాఖ (ప్రెస్ ఆపరేషన్స్) డైరెక్టర్ కల్నల్ రాబ్ మన్నింగ్ చెప్పారు. మరోపక్క ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగంతో జపాన్ ప్రజలు భీతిల్లిపోయారు. రెండో ప్రపంచ యుద్ధంనాటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయా అన్నట్టు జనం వణికిపోయారు. లక్షలాది మంది పౌరులు భయం గుప్పిట గడిపారని సంబంధిత వర్గాలు తెలిపాయి. తరచూ కవ్వింపు చర్యలకు దిగుతూ శాంతికి విఘాతం కల్పిస్తున్న ఉత్తర కొరియాకు అష్టదిగ్బంధనం చేయాలని అమెరికా పిలుపునిచ్చింది. ‘దౌత్య, ఆర్థికపరంగా ఉత్తర కొరియాను ఏకాకిని చేయాలి. ఏ దేశమూ దానితో సంబంధాలు నెరపకూడదు. ఐరాస హెచ్చరికలను బేఖాతరు చేసి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న కిమ్ జోంగ్ ఉన్‌కు గుణపాఠం రావాలి’ అని యుఎస్ రక్షణ మంత్రి మట్టీస్ విజ్ఞప్తి చేశారు. ఉత్తర కొరియా విషయంలో మిగతా దేశాలు తమతో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఐరాస తీవ్ర హెచ్చరిక
ఐరాస: ఉత్తర కొరియా శుక్రవారం మరో క్షిపణిని పరీక్షించడాన్ని ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు తక్షణం స్వస్తిచెప్పాలని భద్రతా మండలి హెచ్చరించింది. శనివారం ఇక్కడ సమావేశమైన మండలి అత్యవసర సమావేశంలో ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు తారస్థాయికి చేరాయనడానికి క్షిపణి పరీక్షే ఉదాహరణగా పేర్కొంది. జపాన్, అమెరికా అభ్యర్థన మేరకు ఇక్కడ సమావేశమైన 15 సభ్యదేశాల భద్రత మండలి ఉత్తర కొరియా చర్యలు అత్యంత దుర్మార్గమని విమర్శించింది. ‘ఇలాంటి పరిస్థితుల్లో జపాన్‌కు అండగా ఉంటాం. అక్కడి ప్రజలకు మా పూర్తి మద్దతు ఉంటుంది’ అని ఐరాసలోని బ్రిటిష్ రాయబారి మాథ్యూ రేక్రాట్ ప్రకటించారు. భద్రతా మండలి సమావేశం తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు.
మా సత్తా చూపించాం: ఉన్
సియోల్: అగ్రరాజ్యం అమెరికా సైనిక శక్తికి తాము ఏమాత్రం తీసుపోమని రుజువుచేయడానికే బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేపట్టినట్టు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. ‘మా మీద ఎన్ని ఆంక్షలు విధించినా పరీక్షలకు స్వస్తిచెప్పబోం. అదే విషయాన్ని తాము నిరూపించాం. క్షిపణులు, హైడ్రోజన్ బాంబు పరీక్షలు అందులో భాగమే’ అని ఆయన స్పష్టం చేశారు. ఉత్తర కొరియా అణు అవసరాలు తీర్చడమే తన లక్ష్యమని ఉన్ వెల్లడించారు. అలాగని దేశాధ్యక్షుడు ప్రతిజ్ఞ చేశారని ఉత్తర కొరియా మీడియా స్పష్టం చేసింది. తమ కార్యక్రమాలు చూశాక అమెరికా సైనిక చర్య అనే ధైర్యం చేయదని ఆయన అన్నారు.

చిత్రం..వైట్‌హౌస్‌కు భార్య మెనానియాతో కలిసి వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్