అంతర్జాతీయం

బెదిరింపులు మానుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, సెప్టెంబర్ 16: క్షిపణుల పరీక్షలతో రెచ్చిపోతున్న ఉత్తర కొరియాను కట్టడి చేయాలని ప్రపంచ దేశాలన్నీ డిమాండ్ చేస్తుంటే చైనా మాత్రం దానికి భిన్నంగా స్పందించింది. కవ్వింపు చర్యలకు పాల్పడుతుందన్న మిషతో ఉత్తర కొరియాను బెదిరించడం మానుకోవాలని అమెరికా, దాని మిత్రదేశాలకు హితవు చెప్పింది. తాజా పరిణామాలపై అమెరికాలోని చైనా రాయబారి తియాంకై మాట్లాడుతూ కొరియా ద్వీపకల్పంపై అణ్వాయుధాలు మోహరించడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అసలే ఉద్రిక్తతలతో ఉన్న ప్రాంతంలో పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందని అన్నారు. ఒక్క కొరియన్ ద్వీపంలోనే కాదు ఎక్కడా అణ్వాయుధాలు మోహరించడం మంచిది కాదు అని ఆయన చెప్పారు. వాషింగ్టన్‌లో తియాంకై చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ హాంగ్‌కాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్టు కథనాలు వెలువరించింది. నెలలోపే జపాన్ మీదుగా ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడంపై అమెరికా, దాని మిత్ర దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తమ సైనిక శక్తి అమెరికాకు ఏమాత్రం తీసిపోదని నిరూపించేందుకే ఉత్తర కొరియా ఈ చర్యకు పాల్పడినట్టు సియోల్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే చర్చలద్వారా ఉత్తర కొరియాను దారిలోకి తీసుకురావాలే తప్ప కవ్వింపునకు పాల్పడవద్దని అమెరికాకు చైనా విజ్ఞప్తి చేసింది. అలాగే తమపై ఆర్థిక ఆంక్షలు విధిస్తే నష్టపోయేది అమెరికానేనని, ఈ విషయం అక్కడి ప్రజలూ తెలుసుకుంటారని తియాంకై స్పష్టం చేశారు.