అంతర్జాతీయం

లండన్ పేలుడు కేసులో 18 ఏళ్ల యువకుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, సెప్టెంబర్ 16: లండన్ భూగర్భ రైల్లో శుక్రవారం జరిగిన శక్తివంతమైన పేలుడుకు సంబంధించి పోలీసులు 18 ఏళ్ల యువకుడిని శనివారం అరెస్టు చేశారు. కాగా, ఈ అరెస్టును పోలీసులు ‘చెప్పుకోదగ్గ పరిణామం’గా అభివర్ణించారు. శనివారం ఉదయం డోవర్ పోర్ట్ ఏరియాలో కెంట్ పోలీసులు ఈ యువకుడ్ని అరెస్టు చేశారు. అతడ్ని స్థానిక పోలీసు స్టేషన్‌లో అరెస్టు చేసిన పోలీసులు ఆ తర్వాత సౌత్ లండన్ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. శుక్రవారం ఉదయం రద్దీ సమయంలో పార్సన్స్ గ్రీన్ భూగర్భ రైల్వే స్టేషన్ వద్ద ఓ ట్యూబ్ రైల్లో శక్తివంతమైన ఐడి పేలడంతో కనీసం 30 మంది గాయపడిన విషయం తెలిసిందే. కాగా, మరికొంతమంది అనుమానితుల కోసం పోలీసు బలగాలు ఇప్పటికీ వేట సాగిస్తున్నాయని లండన్ మెట్రోపాలిటన్ పోలీసు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ నీల్ బసు చెప్పారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ దాడిలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి లేదా వ్యక్తులు ఉన్నట్లుగా కనిపిస్తోందని, వారిని వెతికి పట్టుకోవలసిన అవసరం ఉందని అంతకు ముందు బ్రిటన్ భద్రతా వ్యవహారాల మంత్రి బెన్ వాలెస్ చెప్పారు. ఈ పేలుడుకు సంబంధించి డిటెక్టివ్‌లు ఇప్పటివరకు 45 మంది ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడారని యాంటీ టెర్రరిస్టు హాట్‌లైన్‌కు జనంనుంచి పెద్ద ఎత్తున సమాచారం అందుతూనే ఉందని మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు.