అంతర్జాతీయం

పాక్‌ది వృథా ప్రయాసే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 17: మరోసారి ఐక్యరాజ్య సమితిలో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తున్న తరుణంలో భారత్ తీవ్రస్థాయిలోనే దారి ధోరణిని ఎండగట్టింది. ఇప్పటివరకూ కాశ్మీర్ అంశాన్ని ఎన్నోసార్లు ఐరాసలో పాకిస్తాన్ ప్రస్తావించినా ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని, ఈ తాజా ప్రయత్నం కూడా వృధా ప్రయాసే అవుతుందని స్పష్టం చేసింది. కొన్ని దశాబ్దాలుగా కాశ్మీర్ అంశంపై ఐక్యరాజ్య సమితిలో చర్చ జరిగిన సందర్భం అంటూ ఏదీ లేదని తెలిపింది. అయితే భారత్ మాత్రం గుణాత్మక రీతిలోనే ఐక్య రాజ్య సమితి అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోందని భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. సోమవారం నుంచి ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశం అవుతున్న దృష్ట్యా కాశ్మీర్ అంశం గురించి, దానిపై పాకిస్తాన్ వృధా ప్రయాస గురించి ఆయన మాట్లాడారు. మొదటినుంచీ కూడా భారత్‌ది ప్రగతిశీల దృక్పథం అని, తమ లక్ష్యాల సాధనలో దార్శనిక ధోరణితోనే ముందుకు వెళుతుందని ఆయన వెల్లడించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దేశాల వైఖరి మారాలని, గత అంశాన్ని పట్టుకు వేలాడితే గతంలోనే కొట్టుకుపోయే అవకాశం ఉందని ఆయన అన్నారు. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ నెల 23న ఐక్యరాజ్య సమితిలో మాట్లాడతారు. అలాగే పాకిస్తాన్ కొత్త ప్రధాని అబ్బాసీ కూడా ఈ అంతర్జాతీయ వేదికపై ప్రసంగిస్తారు. ఎలాంటి ప్రయోజనం లేకపోయినా, ఐక్యరాజ్య సమితి చర్చల్లో కాశ్మీర్ అంశాన్ని అదేపనిగా ప్రస్తావించాలంటూ పాకిస్తాన్ భావిస్తే ఆ విషయంలో తాము చేసేదేమీ లేదని పేర్కొన్న ఆయన ‘మియాకీ దౌడ్ మజీద్ తక్’ అని ఉర్దూ సామెతను వినిపించారు. దీని అర్థాన్ని వివరించిన ఆయన కొందరు వ్యక్తుల ఆలోచనలు పరిమితంగానే ఉంటాయని, ఆ చట్రం నుంచి వారు బయటపడజాలరని ఆయన అన్నారు. ఐరాస సదస్సులో కాశ్మీర్ అంశాన్ని తాము లేవనెత్తి తీరుతామని, ఈ అంశానే్న తమ ప్రధాని ప్రధానంగా ప్రస్తావిస్తారని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.
సెక్రటేరియట్‌కు పరిమితం కారాదు
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్య సమితి సంస్కరణలు విస్తృతమైనవిగాను, అన్ని రంగాలకు విస్తరించినవిగా ఉండాలని కేవలం దాని సెక్రటేరియట్‌కు పరిమితం కారాదని భారత్ స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే వారం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో తన తొలి ప్రసంగం ఇవ్వనున్న నేపథ్యంలో అక్బరుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఐరాస సంస్కరణలపై ట్రంప్ సోమవారం (18న) న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఐరాస ప్రధాన కార్యదర్శి జరుపుతున్న సంస్కరణల కృషిని సమర్థించే 120 దేశాలతో పాటుగా భారత్ ఈ సమావేశానికి హాజరు కానుంది. కాగా, ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆదివారం న్యూయార్క్ చేరుకోనున్నారు. ఆమె ఈ నెల 23న జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తారు. వారం రోజుల పాటు ఇక్కడ ఉండే సమయంలో ఆమె ప్రపంచ దేశాల నేతలతో 15-20 ద్వైపాక్షిక సమావేశాలు, పలు బహుళపక్ష భేటీల్లో పాల్గొంటారు.
అమెరికాను బలపర్చిన భారత్
ఐరాస శాంతి పరిరక్షణ మండలిని మరింత బలోపేతం చేస్తూ అమెరికా చేపట్టే సంస్కరణలను భారత్ స్వాగతించింది. శాంతి మండలి విధానాల్లో కొన్ని మార్పులు తెస్తున్నట్టు కొద్దిరోజుల కిందటే యుఎన్ అమెరికా అంబాసిడర్ నిక్కీ హేలీ ప్రకటించటం తెలిసిందే. ‘ఈ విషయంలో భాగస్వామ్యం తప్ప, బంధాలు, వైరుధ్యాలను మేం చూడటం లేదు. శాంతి పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యమిచ్చ దేశం భారత్. ఆ కోణంలో ఆఫ్రికాలో శాంతి పరిరక్షకులకు ఇస్తోన్న శిక్షణ సహా, అనేకానేక అంశాల్లో భారత్-అమెరికా కలిసి పని చేస్తున్నాయని’ అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. భారత్-అమెరికా ద్వైపాక్షిక, బహుళత్వ, బహుపాక్షిక రూపాల్లో సహకారం అందించుకోబోతున్నాయని వెల్లడించారు.

చిత్రం..ఐరాసలో భారత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్