అంతర్జాతీయం

మా వైఖరిలో మార్పులేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 17: వాతావరణ మార్పులను నిరోధించడానికి ఉద్దేశించిన పారిస్ ఒప్పందం విషయంలో తాను మెత్తబడినట్లు వచ్చిన వార్తలను అమెరికా ఖండించింది. పారిస్ వాతావరణ ఒప్పందంపై తిరిగి సంప్రదింపులు జరిపి, ఒప్పందంలోని నిబంధనలను తమ దేశానికి అనుకూలంగా మార్చకపోతే ఒప్పందం నుంచి వైదొలగుతామని అమెరికా ఆదివారం స్పష్టం చేసింది. మోంట్రియల్‌లో జరిగే సమావేశంలో పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగబోమని, అయితే ఈ ఒప్పందంపై తిరిగి సంప్రదింపులు జరపాలని మాత్రమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనా యంత్రాంగం కోరుతుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో వైట్ హౌస్ ప్రకటన వెలువడింది. ‘పారిస్ ఒప్పందం విషయంలో అమెరికా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు’ అని వైట్ హౌస్ అధికార ప్రతినిధి లిండ్‌సే వాల్టర్స్ పేర్కొన్నారు. పారిస్ ఒప్పందంలోని నిబంధనలను అమెరికాకు మరింత అనుకూలంగా మార్చకపోతే ఒప్పందం నుంచి అమెరికా వైదొలగుతుందని అధ్యక్షుడు చాలా స్పష్టంగా చెప్పారని ఆమె ఒక ప్రకటనలో వివరించారు. జర్మనీలోని బోన్‌లో నవంబర్‌లో జరిగే ఐక్యరాజ్య సమితి (ఐరాస) వాతావరణ శిఖరాగ్ర సమావేశంలో పారిస్ ఒప్పందాన్ని నీరుగార్చడానికి అమెరికా గట్టిగా కృషి చేస్తున్న నేపథ్యంలో 34 దేశాలకు చెందిన మంత్రులు మోంట్రియల్‌లో భేటీ అవుతున్నారు. బరాక్ ఒబామా హయాంలో 190కి పైగా దేశాలు అంగీకరించిన పారిస్ ఒప్పందం నుంచి అమెరికా ఉపసంహరించుకుంటుందని, తిరిగి సంప్రదింపులు జరుపుతుందని డొనాల్డ్ ట్రంప్ ఈ సంవత్సరం తొలినాళ్లలో ప్రకటించారు. పారిస్ ఒప్పందంవల్ల చైనా, భారత్ వంటి దేశాలు బాగా లబ్ధి పొందుతున్నాయని, ఈ ఒప్పందం అమెరికా పట్ల పక్షపాతంతో కూడుకొని ఉందని, దీనివల్ల అమెరికాలో వ్యాపారానికి, ఉద్యోగాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆయన పేర్కొన్నారు.