అంతర్జాతీయం

మళ్లీ... హెచ్-1బి వీసాల పరిశీలన పునఃప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 19: దాదాపు అయిదు నెలల క్రితం నిలిపివేసిన హెచ్-1బి వర్క్ వీసాల పరిశీలన ప్రక్రియను అమెరికా తిరిగి ప్రారంభించింది. అమెరికా వెళ్లే భారతీయ ఐటి నిపుణులందరు కూడా దాదాపుగా ఈ హెచ్-1బి వీసాలపైనే వెళ్తుండడం తెలిసిందే. కాగా, ఈ వర్క్ వీసాల కోసం దరఖాస్తులు భారీ సంఖ్యలో రావడంతో అమెరికా సిటిజన్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సిఐఎస్) గత ఏప్రిల్‌లో ఈ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే 2018 ఆర్థిక సంవత్సరానికి ఉన్న పరిమితికి లోబడి అన్ని కేటగిరీల హెచ్-1బి వీసాల దరఖాస్తుల ప్రీమియం ప్రాసెసింగ్‌ను సోమవారం తిరిగి ప్రారంభించినట్లు యుఎస్‌సిఐఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. 2018 ఆర్థిక సంవత్సరానికి అమెరికా కాంగ్రెస్ హెచ్-1బి వీసాల సంఖ్యను 65 వేలకు పరిమితం చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది. వీటితో పాటుగా అమెరికా ఉన్నత విద్యా డిగ్రీలు కలిగిన ఉద్యోగులను తీసుకోవడం కోసం వచ్చిన 20 వేల దరఖాస్తులను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. వీసాల మంజూరు ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేయకపోతే దరఖాస్తుదారుడికి ప్రాసెసింగ్ ఫీజును వాపసు చేస్తామని కూడా యుఎస్‌సిఐఎస్ తెలిపింది.