అంతర్జాతీయం

ఆర్మీ కుట్ర అబద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 19: ప్రధాని పదవి నుంచి నవాజ్ షరీఫ్‌కు ఉధ్వాసన పలకడం వెనుక ఆర్మీ పాత్ర ఉందన్న వాదనను పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ బజ్వా కొట్టిపారేశారు. అది అబద్ధం అంటూనే, తాను నిజమైన ప్రజాస్వామ్యవాదినని చెప్పుకున్నారు. పనామా పేపర్స్ కేసులో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు గత జూలై 28న దేశ అత్యన్నత న్యాయస్థానం ఉధ్వాసన పలికడం తెలిసిందే. సోమవారం జనరల్ హెడ్ క్వార్టర్స్‌ను జాతీయ అసెంబ్లీ డిఫెన్స్ కమిటీ సభ్యులు సందర్శించినపుడు ఈ అంశం జనరల్ బజ్వాతో ప్రస్తావనకు వచ్చినట్టు డాన్ పత్రిక ఓ కథనంలో పేర్కొంది. పాక్ భద్రతా కార్యకలాపాలు, మిలటరీ కోర్టులు, రక్షణ శాఖ బడ్జెట్, యుఎస్‌తో సంబంధ బాంధవ్యాలు, బోర్డర్‌లో భారత్‌తోవున్న వివాదాలు, ఆఫ్గాన్ సంబంధాల్లో సంక్లిష్ట పరిస్థితులు, పౌర సైన్యం వ్యవహారాల్లాంటి అనేకానేక అంశాలను డిఫెన్స్ కమిటీ సభ్యులు ఆర్మీ చీఫ్‌తో చర్చించినట్టు డాన్ పత్రిక పేర్కొంది. ఇందులో భాగంగా షరీఫ్ అంశం ప్రస్తావనకు వచ్చినపుడు ‘ఆయన ఉధ్వాసన వెనుక ఆర్మీ పాత్ర ఉందనడం శుద్ధ అబద్ధం. నేను నిజమైన ప్రజాస్వామ్యవాదిని. పార్లమెంట్ పట్ల ప్రగాఢమైన విశ్వాసం ఉన్నవాడిని. గత ప్రధానికంటే ఇప్పటి ప్రధాని ఎన్నో రెట్లు మెరుగు’ అని ఆర్మీ చీఫ్ వ్యాఖ్యానించారని కమిటీ సభ్యుల్లో ఒకరు చెప్పినట్టు డాన్ కథనం రాసింది. రక్షణ శాఖకు 18 శాతం బడ్జెట్ కేటాయింపులను ప్రస్తావిస్తూ, ఈ శాతాన్ని మరింత పెంచాల్సి ఉంది. రక్షణ విభాగానికి అతి ముఖ్యమైనవి కొన్ని సముపార్జించాల్సి ఉన్న తరుణంలో, బడ్జెట్ పరిమితిని పెంచుకోవడం ఎంతైనా ముఖ్యం’ అని బజ్వా అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాలు, ముఖ్యంగా పొరుగు దేశాలతో పాక్ మంచి సంబంధాలు, బాధ్యతాయుతమైన బాంధవ్యాన్ని కోరుకుంటోందని కూడా బజ్వా వ్యాఖ్యానించారు. పాక్ ఆర్మీకి సంబంధించి పార్లమెంట్ సభ్యులకున్న సందేహాల నివృత్తికి తాను డిపెన్స్ కమిటీ లేదా ఏ పార్లమెంట్ కమిటీ ముందైనా హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నా’ అని జనరల్ బజ్వా వెల్లడించారని డాన్ పత్రిక తన కథనంలో పేర్కొంది.