అంతర్జాతీయం

మీకే మా మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెనీవా, జూన్ 6: అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జి)లో చేరడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న భారత్ చేసిన దౌత్య ప్రయత్నాలకు ఫలితం దక్కింది. 48 దేశాలతో కూడిన ఎన్‌ఎస్‌జి కీలక సమావేశం జరుగనున్న తరుణంలో భారత్ సోమవారం స్విట్జర్లాండ్ మద్దతు సంపాదించగలిగింది. భారతీయులు స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో కూడబెట్టిన నల్లధనాన్ని వెలికితీయడంలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి కూడా ఇరు దేశాలు అంగీకరించాయి. స్విట్జర్లాండ్ అధ్యక్షుడు జోహన్ స్క్నెయిడర్ అమ్మన్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక, ప్రపంచ అంశాలపై చర్చలు జరిపిన అనంతరం.. ఎన్‌ఎస్‌జిలో భారత్ చేరికకు తమ దేశం మద్దతు ఇస్తోందని ప్రకటించారు. ‘ఎన్‌ఎస్‌జిలో చేరికకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతిస్తామని మేము వాగ్దానం చేశాము’ అని అమ్మన్ సోమవారం మోదీతో కలిసి నిర్వహించిన సంయుక్త విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఎన్‌ఎస్‌జిలో చేరాలనుకుంటున్న భారత్‌ను అర్థం చేసుకొని స్విట్జర్లాండ్ మద్దతిచ్చినందుకు ఆ దేశాధ్యక్షుడికి భారత ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. నల్లధనం జాడ్యం, పన్ను ఎగవేత వ్యతిరేక పోరాటం ఇరు దేశాలకు ప్రాధాన్యం గల అంశమని కూడా ఆయన పేర్కొన్నారు.
భారత్ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పిటి)పై సంతకం చేయనందున ఎన్‌ఎస్‌జిలో ఆ దేశం చేరికపై ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరం ఉందని చైనా పట్టుబడుతున్న నేపథ్యంలో భారత్‌కు స్విట్జర్లాండ్ అండగా నిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ట్రాక్ రికార్డ్ ఆధారంగా ఆ దేశాన్ని ఎన్‌ఎస్‌జిలో చేర్చుకోవడానికి అమెరికా సహా పలు ఇతర ఎన్‌ఎస్‌జి సభ్య దేశాలు ఇదివరకే మద్దతిచ్చాయి. ఏకాభిప్రాయ సూత్రం ఆధారంగా ఎన్‌ఎస్‌జి పనిచేస్తుంటుంది. ఒక్క దేశం భారత్‌కు వ్యతిరేకంగా ఓటు వేసినా ఎన్‌ఎస్‌జిలో చేరడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు గండిపడుతుంది. ఎన్‌ఎస్‌జిలో చేరడానికి గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్న భారత్ మే 12న లాంఛనంగా దరఖాస్తు చేసుకుంది. జూన్ 9న వియన్నాలో, జూన్ 24న సియోల్‌లో జరుగనున్న ఎన్‌ఎస్‌జి ప్లీనరీ సమావేశాలలో ఈ దరఖాస్తును పరిశీలిస్తారు. భారత ప్రధాని మోదీ ఎన్‌ఎస్‌జిలో మరో సభ్య దేశమైన మెక్సికోతో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఎన్‌ఎస్‌జి ప్లీనరీ సమావేశాలు జరుగనున్న తరుణంలో భారత్.. చైనా సహా వివిధ ఎన్‌ఎస్‌జి సభ్యదేశాలతో దౌత్యపరమైన ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
భారతీయులు స్విట్జర్లాండ్‌లో కూడబెట్టిన నల్లధనాన్ని వెలికితీసే విషయంలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని మోదీ, అమ్మన్ అంగీకారానికి వచ్చారు. వాణిజ్యం, పెట్టుబడులు, వొకేషనల్ ట్రైనింగ్ రంగాలలో సంబంధాలను పెంపొందించుకోవాలనే దృఢ సంకల్పాన్ని ఇరు దేశాల నేతలు వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో నాన్ పర్మనెంట్ సభ్యత్వం కోసం ఇరు దేశాలు చేసే ప్రయత్నాలకు పరస్పరం సహకరించుకోవాలని కూడా నిర్ణయించినట్లు అమ్మన్ తెలిపారు.