అంతర్జాతీయం

అమలులోకి వచ్చిన అణ్వస్త్ర నిషేధ ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 21: అణ్వాయుధాలను నిషేధించడానికి కుదిరిన అంతర్జాతీయ ఒడంబడికపై 50 దేశాలు సంతకాలు చేశాయి. దీంతో ఈ ఒడంబడిక అమలులోకి వచ్చినట్లయింది. ఈ ఒడంబడికను అణ్వస్త్ర సంపన్న దేశాలయిన అగ్రరాజ్యాలు వ్యతిరేకిస్తుండగా, అణ్వస్త్ర నిషేధాన్ని సమర్థించేవారు మాత్రం ఇదో చరిత్రాత్మక ఒప్పందంగా పేర్కొంటున్నారు. ప్రపంచానికి నైతిక నాయకత్వం ఎంతయినా అవసరమని, అలాంటి నైతిక నాయకత్వాన్ని ప్రపంచానికి చూపించిన ప్రభుత్వాలు మీవని బుధవారం ఇక్కడ ఈ ఒడంబడకిపై దేశాలు సంతకాలు చేసే కార్యక్రమం మొదలైన సందర్భంగా అణ్వస్త్రాలను నిషేధించడానికి అంతర్జాతీయ ప్రచారోద్యమం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీట్రిస్ ఫిన్ వ్యాఖ్యానించారు. తొలిరోజు సంతకాల కార్యక్రమం ముగిసేసరికి ఇండోనేసియా, ఐర్లాండ్‌లాంటి 50 దేశాలు ఈ ఒడంబడికపై సంతకాలు చేశాయి. ఇష్టపడితే మిగతా దేశాలు కూడా ఆ తర్వాత సంతకాలు చేయవచ్చు. గయానా, థాయిలాండ్, వాటికన్ దేశాలు ఇదివరకే ఈ ఒడంబడికపై సంతకాలు చేశాయి. ఈ ఒడంబడికను సమర్థించిన దేశాల్లో ఇది అమలులోకి రావాలంటే కనీసం 50 దేశాలు దీనిపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. సంతకాలు చేసిన దేశాలు అణ్వస్త్రాలను అభివృద్ధి చేయడం, తయారు చేయడం, పరీక్షించడం, ఇతర మార్గాల్లో సముపార్జించుకోవడం, నిల్వ చేయడం లాంటివి ఎట్టి పరిస్థితుల్లోను చేయడానికి వీలులేదు. రెండో ప్రపంచ యుద్దం సమయంలో అమెరికా జపాన్‌పై రెండు అణుబాంబులు వేసిన 70 ఏళ్ల తర్వాత ప్రపంచంలో ఇప్పుడు 15 వేలకు పైగా అణ్వస్తాలున్నట్లు అంచనా. ఉత్తర కొరియా జరుపుతున్న అణ్వస్త్ర, క్షిపణి పరీక్షల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగిపోతున్న నేపథ్యంలో మంగళవారం ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ, ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత ఇప్పుడు అణ్వస్త్ర దాడి ముప్పు తారస్థాయికి చేరుకొందని వ్యాఖ్యానించడం తెలిసిందే. ప్రపంచాన్ని అణ్వస్త్ర రహితంగా చేయాలన్న లక్ష్యం దిశగా ఈ ఒడంబడిక ఓ ముందడుగని బుధవారం ఆయన వ్యాఖ్యానించారు. దాదాపు 50 ఏళ్లలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం ద్వారా దేశాలు చేసిన దానికన్నా అణ్వస్త్రాలను అంతమొందించే దిశగా మరింతగా ఒత్తిడి తేవలసిన సమయం వచ్చిందని అణ్వస్త్ర నిషేధాన్ని సమర్థిస్తున్నవారు వాదిస్తున్నారు. అణ్వస్త్రాలను కలిగి ఉన్న అయిదు అగ్రరాజ్యాలు, అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, వాటి మిత్ర దేశాలు చర్చలను బహిష్కరించినప్పటికీ గత జూలైలో 120కి పైగా దేశాలు ఈ కొత్త ఒడంబడికకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. బుధవారం ఈ ఒప్పందంపై బ్రెజిల్ మొదటగా సంతకం చేయగా, ఆ తర్వాత అల్జీరియా, వెనిజులా సంతకాలు చేశాయి.