అంతర్జాతీయం

షార్ట్ రేంజ్ అణ్వస్త్రాలు మా వద్దా ఉన్నాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 21: భారత సైన్యం అనుసరిస్తున్న ‘కోల్డ్ స్టార్ట్’ విధానాన్ని ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ తక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించే (షార్ట్ రేంజ్) అణ్వస్త్రాలను తయారు చేసిందని ఆ దేశ ప్రధాన మంత్రి షాహిద్ ఖకన్ అబ్బాసి గురువారం తెలిపారు. పాకిస్తాన్ ప్రధాని హోదాలో తొలిసారి అమెరికాకు వచ్చిన అబ్బాసి తమ దేశ అణ్వస్త్రాల గిడ్డంగి చాలా సురక్షితంగా ఉందని పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన అణ్వస్త్రాల గిడ్డంగిని కలిగి ఉందన్న వాదనపై ఆయన స్పందిస్తూ.. తమ వద్ద ఎలాంటి వ్యూహాత్మక అణ్వస్త్రాలు లేవని చెప్పారు. అయితే భారత్ అభివృద్ధి చేసిన ‘కోల్డ్ స్టార్ట్ విధానాన్ని’ ఎదుర్కొనేందుకు తాము తక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే అణ్వస్త్రాలను అభివృద్ధి చేశామని ఆయన అమెరికాకు చెందిన సంస్థ ‘విదేశీ సంబంధాల మండలి’లో చెప్పారు. పాకిస్తాన్‌తో యుద్ధం సంభవిస్తే అనుసరించడానికి వీలుగా భారత సైన్యం ‘కోల్డ్ స్టార్ట్ విధానాన్ని’ అభివృద్ధి చేసింది. ఈ విధానంలో భాగంగా ఏర్పాటయిన యూనిఫైడ్ బాటిల్ గ్రూపులు ముందుగా దాడులకు దిగుతాయి. ఒకవేళ యుద్ధం సంభవించినప్పటికీ పాకిస్తాన్ అణ్వస్త్రాలను సంధించకుండా నిరోధించేందుకు భారత సైన్యం తన సాంప్రదాయ ఆయుధాలతోనే దాడులు చేస్తుంది. తమ వ్యూహాత్మక అణ్వస్త్రాలపై అత్యంత భద్రమైన కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ ఉందని అబ్బాసి తెలిపారు. పాకిస్తాన్ అణ్వస్త్రాల గిడ్డంగికి సంబంధించి కమాండ్, కంట్రోల్, ఆపరేషనల్ నిర్ణయాలు తీసుకునే బాధ్యత ద న్యూక్లియర్ కమాండ్ అథారిటి ఆఫ్ పాకిస్తాన్‌దని ఆయన పేర్కొన్నారు.