అంతర్జాతీయం

వాయుకాలుష్యంతో కిడ్నీలకు ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 22: వాయుకాలుష్యం కిడ్నీపై తీవ్ర ప్రభావం చూపుతుందని శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో కాలుష్యం వల్ల తీవ్రమైన వ్యాధులు సంక్రమిస్తాయని అన్నారు. గుండె జబ్బులు, కేన్సర్, ఆస్తమా, ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలు సంభవిస్తాయన్న శాస్తవ్రేత్తలు కిడ్నీలపైనా దుష్ప్రభావం చూపుతుందని, ముఖ్యంగా వాయు కాలుష్యంతో తీవ్ర ముప్పు ఉందని వారన్నారు. వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసింది. ఇంతకు ముందు గుండెపోటు, కేన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులే జాబితాలో ఉండగా తాజాగా కిడ్నీ ఫెయిల్యూర్‌నూ చేర్చారు. 2004 నుంచి వాతావరణ కాలుష్యం వల్ల వస్తున్న రోగాలపై శాస్తవ్రేత్తలు అధ్యయనం జరిపారు. అమెరికాలో సుమారు 2.5 మిలియన్ల మంది వాయుకాలుష్యం వల్ల తీవ్రమైన కిడ్నీ వ్యాధుల బారినపడ్డారని నివేదికలో తేల్చారు. యుఎస్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజన్సీ (ఇపిఏ), నాసా నుంచి వాయు కాలుష్యానికి సంబంధించి డేటాను సేకరించి పరిశోధనలు జరిపినట్టు వర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జియాద్ అలె-అలే తెలిపారు.