అంతర్జాతీయం

కాశ్మీర్ సమస్యకు చర్చలే పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, సెప్టెంబర్ 22: భారత్, పాకిస్తాన్‌లు ద్వైపాక్షిక చర్చల ద్వారా కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించుకోవాలని చైనా శుక్రవారం సూచించింది. కాశ్మీర్ వివాదానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి (ఐరాస) తీర్మానాన్ని అమలు చేయాలని ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ (ఒఐసి) ఇచ్చిన పిలుపును చైనా ఖండించింది. కాశ్మీర్ వివాదంపై ఒఐసి చేసిన తీర్మానం గురించి ప్రశ్నించగా, చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లు కాంగ్ బదులిస్తూ ఈ వివాదాన్ని భారత్, పాకిస్తాన్‌లే పరిష్కరించుకోవాలని అన్నారు. కాశ్మీర్ వివాదంపై చైనా వైఖరి చాలా స్పష్టంగా ఉందని లు కాంగ్ పేర్కొన్నారు.
‘కాశ్మీర్ వివాదం చారిత్రకంగా వచ్చింది. భారత్, పాకిస్తాన్ చర్చలను, సంప్రదింపులను పెంపొందించుకోగలవని, సంబంధిత వివాదాలను పరిష్కరించుకోగలవని, తద్వారా ఇరు దేశాలు కలిసి ప్రాంతీయంగా శాంతి, స్థిరత్వాలను పరిరక్షించగలవని చైనా విశ్వసిస్తోంది’ అని లు కాంగ్ అన్నారు. పాకిస్తాన్ కూడా సభ్యురాలిగా ఉన్న 57 దేశాల ఒఐసి కాశ్మీర్ వివాదంపై ఐరాస తీర్మానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానించడం పరిపాటిగా మారింది. ఐరాస జనరల్ అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో ఒఐసి కాంటాక్ట్ గ్రూప్ రెండు రోజుల క్రితం సమావేశమైంది.