అంతర్జాతీయం

రేపటితో ముగియనున్న ముస్లిం దేశాల ట్రావెల్ బ్యాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 22: ఆరు ముస్లిం దేశాలకు చెందిన ప్రజలు అమెరికాలో అడుగుపెట్టకుండా చూడడం కోసం ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆరు నెలల ట్రావెల్ బ్యాన్ ఆదివారంతో ముగియనుంది. అయితే ఆ దేశాల ప్రజలను దేశంలోకి మళ్లీ రానిస్తారా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొని ఉంది. అమెరికా గతంలో ప్రకటించిన విధానం ప్రకారమయితే ఆదివారం తర్వాత సిరియా, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమన్ దేశాల్లోని అమెరికా దౌత్య కార్యాలయాలు లేదా ప్రతినిధులు ఆయా దేశాల వారు అమెరికా సందర్శించడం కోసం వీసాలను జారీ చేయాలి. అయితే సుప్రీంకోర్టులో ట్రావెల్ బ్యాన్‌పై విచారణ జరిగి తీర్పు వచ్చేంతవరకు మరో 90 రోజుల పాటు ఈ నిషేధాన్ని పొడిగించాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోందని చెబుతున్నారు. దేశ భద్రతకన్నా రాజకీయాలు ఈ అంశాన్ని నిర్ణయించనున్నాయని, సుప్రీంకోర్టులో ఈ నిషేధానికి వ్యతిరేకంగా వాదించిన అమెరికా సివిల్ లిబర్టీస్ యూనియన్ న్యాయవాది ఒమర్ జద్వత్ వ్యాఖ్యానించారు.