అంతర్జాతీయం

అతనో పిచ్చోడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 22: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య మాటల యుద్ధం మరింత తీవ్ర స్థాయికి చేరింది. ట్రంప్ శుక్రవారం కిమ్ జోంగ్ ఉన్‌ను పిచ్చివాడుగా అభివర్ణించారు. పిచ్చివాడయిన ఉన్‌ను ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో పరీక్షించడం జరుగుతుందని ట్రంప్ హెచ్చరించారు. పరస్పరం అవమానించుకునేలా ఇద్దరు నేతల మధ్య కొనసాగుతున్న వాగ్యుద్ధంలో ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇవి. ‘మతి భ్రమించి పిచ్చివాడయిన, తన వాళ్లనే చంపుకుంటున్న ఉత్తర కొరియాకు చెందిన ఉన్‌ను ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో పరీక్షించడం జరుగుతుంది’ అని ట్రంప్ శుక్రవారం సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో హెచ్చరించారు. ఉత్తర కొరియాను పూర్తిగా నాశనం చేస్తానని ఇటీవల హెచ్చరించిన ట్రంప్‌పై కిమ్ జోంగ్ ఉన్ శుక్రవారం ఉదయం విరుచుకుపడ్డారు. ‘ఉత్తర కొరియాను నాశనం చేస్తానన్నందుకు మతిభ్రష్టుడయిన అమెరికా ముసలివాడు మూల్యం చెల్లించుకుంటాడు’ అని కిమ్ జోంగ్ ఉన్ పేర్కొన్నారు. ప్రపంచం యావత్తు చూస్తుండగా ట్రంప్ తనను, తన దేశాన్ని అవమానించారని, చరిత్రలోనే అత్యంత క్రూరంగా యుద్ధాన్ని ప్రకటించారని కిమ్ జోంగ్ ఉన్ ధ్వజమెత్తినట్టు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఐక్యరాజ్య సమితి (ఐరాస) జనరల్ అసెంబ్లీలో ట్రంప్ తొలి ప్రసంగం అసాధారణంగా, ఆటవికంగా, మూర్ఖంగా ఉందని కిమ్ జోంగ్ ఉన్ విరుచుకుపడ్డారు. ట్రంప్ ఈ ప్రసంగంలోనే కిమ్ జోంగ్ ఉన్‌ను ‘రాకెట్ మాన్’గా అభివర్ణిస్తూ, ఉత్తర కొరియాను పూర్తిగా ధ్వంసం చేస్తానని హెచ్చరించారు. ఆ తరువాత అమెరికా గురువారం ఉత్తర కొరియాపై కఠినమైన ఆంక్షలను ప్రకటించింది.