అంతర్జాతీయం

పాక్.. ఉగ్ర ఫ్యాక్టరీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 23: ఉగ్రవాద ముఠాలను సృష్టిస్తూ శాంతి, సుస్థిరతలకు విఘాతం కలిగిస్తున్న పాకిస్తాన్‌పై భారత్ ఐక్యరాజ్య సమితి (ఐరాస) వేదికగా మరోసారి విరుచుకుపడింది. లష్కర్ ఎ తోయిబా (ఎల్‌ఇటి), జైష్ ఎ మొహమ్మద్ (జెఇఎం), హిజ్‌బుల్ ముజాహిదీన్, హక్కాని నెట్‌వర్క్ వంటి ఉగ్రవాద సంస్థలను పాకిస్తాన్ సృష్టించిందని ధ్వజమెత్తుతూ, ‘శ్రేష్ఠమైన ఉగ్రవాద ఎగుమతి ఫ్యాక్టరీ’గా పాకిస్తాన్ ఎందుకు అప్రతిష్ఠను మూటగట్టుకుందో ఆత్మశోధన చేసుకోవాలని ఆ దేశ నాయకులకు భారత్ హితవు పలికింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ శనివారం 72వ ఐరాస జనరల్ అసెంబ్లీ సెషన్‌లో ప్రసంగిస్తూ ఉగ్రవాదం, వాతావరణ మార్పు, తీరప్రాంత భద్రత, సైబర్ సెక్యూరిటి, ఐరాస భద్రతా మండలి సంస్కరణలు, పేదరికం, నిరుద్యోగం వంటి అంశాలను ప్రస్తావించారు. భారత్‌కు వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రకటించిందంటూ పాకిస్తాన్‌పై ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీభత్సం, క్రూరత్వం, హత్యలు, అమానుషాలను ఎగుమతి చేయడంలో ప్రపంచంలోనే మేటిగా నిలిచిన పాకిస్తాన్.. ఈ వేదికపై నుంచి మానవత్వాన్ని ప్రబోధించడం ద్వారా నయవంచనలో విజేతగా నిలిచిందని ఆమె పదునయిన పదజాలంతో విమర్శించారు. భారత్ మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాహిద్ ఖకన్ అబ్బాసి గురువారం ఐరాస జనరల్ అసెంబ్లీలో చేసిన ఆరోపణలను సుష్మా స్వరాజ్ ప్రస్తావిస్తూ, భారత్, పాకిస్తాన్ రెండు దేశాలు కూడా కొన్ని గంటల వ్యవధిలోనే స్వాతంత్య్రం పొందగా, ఈ రోజు భారత్ ప్రపంచంలోనే ఐటి సూపర్‌పవర్‌గా గుర్తింపు పొందగా, పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాద ఎగుమతిలో మేటి దేశంగా గుర్తింపు పొందిందని అన్నారు. ఇలా ఎందుకు జరిగిందో పాకిస్తాన్ రాజకీయ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆమె హితవు పలికారు. ఐరాస జనరల్ అసెంబ్లీలో వరుసగా రెండో సంవత్సరం హిందీలో ప్రసంగించిన సుష్మా స్వరాజ్, పాకిస్తాన్ చేస్తున్న పాపిష్టి ఉగ్రవాద ఎగుమతికి లక్ష్యంగా ఉన్నప్పటికీ భారత్ ఎంతో ఎత్తుకు ఎదిగిందని అన్నారు. మొత్తం ప్రపంచానికే గర్వకారణంగా నిలిచే శాస్త్ర, సాంకేతిక సంస్థలను తాము నెలకొల్పామని పేర్కొన్న సుష్మా స్వరాజ్ పాకిస్తాన్ ఉగ్రవాదం ఎగుమతి మినహా ప్రపంచానికి ఏమిచ్చిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఐఐటిలు, ఐఐఎంలు, ఎఐఐఎంఎస్‌లను నెలకొల్పిన అంశాన్ని ఆమె ప్రస్తావిస్తూ భారత్ అనేక మంది శాస్తజ్ఞ్రులను, పరిశోధకులను, వైద్యులను, ఇంజనీర్లను తయారు చేసిందన్నారు. మీరు ఎవరిని తయారు చేశారంటూ ఆమె పాకిస్తాన్‌ను నిలదీశారు. ‘మీరు ఉగ్రవాద శిబిరాలను సృష్టించారు. మీరు ఎల్‌ఇటి, జెఇఎం, హిజ్బుల్ ముజాహిదీన్, హక్కాని నెట్‌వర్క్ వంటి ఉగ్రవాద సంస్థలను సృష్టించారు’ అంటూ ఆమె పాకిస్తాన్ నిజస్వరూపాన్ని ఐరాస వేదికపై ఎండగట్టారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అభివృద్ధి చేయడానికి వ్యయం చేసిందని, అలాకాకుండా దేశ అభివృద్ధికి వ్యయం చేసి ఉంటే, ఈ రోజు పాకిస్తాన్, ప్రపంచం సురక్షితంగా, బాగుగా ఉండేవని సుష్మా స్మరాజ్ అన్నారు. పాకిస్తాన్ సృష్టించిన ఉగ్రవాద సంస్థలు భారత్‌కే కాకుండా పొరుగు దేశాలయిన అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లకు కూడా నష్టం చేకూరుస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించాక శాంతి, స్నేహ హస్తాన్ని అందిస్తే పాకిస్తాన్ ఎందుకు ముందుకు రాలేదని ఆమె నిలదీశారు.