అంతర్జాతీయం

యాంటీ-షిప్ క్షిపణిని పరీక్షించిన పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచి, సెప్టెంబర్ 23: పాకిస్తాన్ నావికాదళం శనివారం యాంటీ- షిప్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఓపక్క సరిహద్దుల్లో కాల్పుల ఉల్లంఘనకు తెగబడుతూనే, తాజాగా క్షిపణి ప్రయోగం జరపడం భారత్‌ను రెచ్చగొట్టడమేనన్న వాదన వినిపిస్తోంది. ఐరాస సాధారణ సమావేశంలో భారత్ పట్ల తన ధోరణికి తీవ్ర వ్యతిరేకతలు మూటగట్టుకున్న పాక్, తాజాగా క్షిపణిని నౌక సహాయం లేకుండానే సీ కింగ్ హెలికాప్టర్ నుంచి ప్రయోగించటం గమనార్హం. ఈ క్షిపణి అరేబియా మహాసముద్రంలోని లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించిందని పాకిస్తాన్ నేవీ అధికార ప్రతినిధిని ఉటంకిస్తూ డాన్ వార్తాపత్రిక తెలిపింది. పాకిస్తాన్ నావికాదళ అధిపతి అడ్మిరల్ ముహమ్మద్ జకాఉల్లా సమక్షంలో క్షిపణిని ప్రయోగించారు. పాకిస్తాన్ నావికాదళం యుద్ధ సంసిద్ధతను, వృత్తి నైపుణ్య పాటవాన్ని విజయవంతంగా నిర్వహించినట్టు ఈ క్షిపణి పరీక్ష వెల్లడిస్తోందని ఈ సందర్భంగా జకాఉల్లా పేర్కొన్నారు. అరేబియా మహాసముద్రంలో ఉన్న పాకిస్తాన్ యుద్ధ నౌకా సమూహాల యూనిట్లను కూడా జకాఉల్లా సందర్శించారు. పాకిస్తాన్ నావికాదళం ఎంత మూల్యమైనా చెల్లించి సముద్ర సరిహద్దులను, దేశ ప్రయోజనాలను పరిరక్షిస్తుందని ఈ సందర్భంగా అన్నారు. ఈ ఏడాది మార్చిలో పాకిస్తాన్ నేవీ భూఉపరితలం నుంచి సముద్రంలోని లక్ష్యాన్ని ఛేదించే యాంటి- షిప్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. కోస్తా తీర ప్రాంతం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించిందని డాన్ న్యూస్ తెలిపింది. పాకిస్తాన్ నావికాదళం ఈ ఏడాది మేలో బ్రిటన్ నుంచి ఏడు వెస్ట్‌ల్యాండ్ సీ కింగ్ మల్టీ రోల్ హెలికాప్టర్లను స్వీకరించింది. వీటి తయారీకి పాకిస్తాన్ 2016లోనే బ్రిటన్‌తో ఒప్పందం కుదుర్చుకుందని డాన్ న్యూస్ వివరించింది.