అంతర్జాతీయం

కొత్త క్షిపణిని పరీక్షించిన ఇరాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెహ్రాన్, సెప్టెంబర్ 23: అమెరికా బెదిరింపులను ఖాతరు చేయకుండా ఇరాన్ ఒక కొత్త మీడియం రేంజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఖొరామ్‌షహర్ అనే ఈ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన చిత్రాలను ఇరాన్ అధికార టెలివిజన్ శనివారం ప్రసారం చేసింది. ఇరాన్ శుక్రవారం నిర్వహించిన ఉన్నత స్థాయి మిలిటరీ పరేడ్‌లో ఈ క్షిపణిని ప్రదర్శించింది. రెండు వేల కిలో మీటర్ల దూరంలో గల లక్ష్యాన్ని ఛేదించగలిగే ఈ క్షిపణి బహుళ వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలుగుతుంది. ‘చాలా కాలంగా కొంతమంది బెదిరింపు భాషలో మాట్లాడుతుండటం వల్ల దేశ రక్షణ పాటవాన్ని బలోపేతం చేసే కృషి కొనసాగుతుంది. ఇరాన్ వివిధ రకాల క్షిపణులను తయారు చేయడానికి ఎవరి అనుమతిని కోరబోదు’ అని ఇరాన్ రక్షణ శాఖ మంత్రి అమీర్ హతామి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. న్యూయార్క్‌లో కొనసాగుతున్న ఐక్యరాజ్య సమితి (ఐరాస) జనరల్ అసెంబ్లీలో అమెరికా, ఇరాన్ దౌత్య వర్గాల మధ్య తాజాగా మాటల యుద్ధం జరిగిన నేపథ్యంలో ఇరాన్ ఈ కొత్త క్షిపణిని పరీక్షించింది.