అంతర్జాతీయం

అడ్డంగా.. దొరికిన పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 24: అబద్ధం అడినా అతికినట్లు ఉండాలని పెద్దలు అంటారు. అయితే ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్‌ను దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నించిన పాకిస్తాన్ ఏమాత్రం పొంతన లేని అబద్ధం ఆడి అడ్డంగా దొరికిపోయింది. పాకిస్తాన్ ఉగ్రవాద కర్మాగారంగా మారిందంటూ శనివారం భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ చేసిన ఆరోపణలను ఖండించే సమయంలో పాక్ ఈ ఘోర తప్పిదం చేసింది. ఐరాస సర్వ ప్రతినిధి సభలో సుష్మాస్వరాజ్ మాట్లాడిన తర్వాత పాక్ ప్రతినిధి మలీహా లోధీ మాట్లాడారు. సుష్మాస్వరాజ్ పాక్‌పై చేసిన ఆరోపణలను ఖండిస్తూ, వాస్తవానికి భారతే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని, కాశ్మీర్‌లో పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ, ముఖమంతా తీవ్రగాయాలతో ఉన్న ఓ యువతి ఫోటోను చూపిస్తూ, కాశ్మీర్‌లో భద్రతా దళాల పెల్లెట్ల దాడికి గురయిన మహిళగా పేర్కొన్నారు. అయితే వాస్తవానికి ఆ ఫోటోలో ఉన్న యువతిది కాశ్మీర్ కాదు... గాజా ప్రాంతం. 17 ఏళ్ల ఆ యువతి అసలు పేరు రవ్యా అబూ జోమా. 2014లో గాజా ప్రాంతంపై జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. గాజా సిటీలోని షిఫా ఆస్పత్రిలో దీనంగా ఉన్న ఆ యువతిని అమెరికాకు చెందిన ప్రముఖ ఫోటో జర్నలిస్టు హైదీ లెవిన్ తీశారు. హృదయ విదారకంగా ఉన్న ఆ ఫోటోకు అప్పట్లో లెవిన్‌కు అవార్డు కూడా వచ్చింది. బ్రిటన్‌కు చెందిన ‘గార్డియన్’ దినపత్రిక వెబ్‌సైట్‌లో ఇప్పటికీ ఆ ఫోటో ఉంది. సోషల్ మీడియాలో లోధీ ఇలాంటి తప్పుడు ఫోటోను ఉపయోగించుకోవడం విస్తృతంగా ప్రచారం అయిన తర్వాత సామాజిక మాధ్యమాన్ని చురుగ్గా ఉపయోగించుకునే ఆమె దీనిపై ఎలాంటి వివరణా ఇవ్వలేదు. కాగా, లోధీ తన అబద్ధపు ఆరోపణలకోసం ఇలాంటి ఫోటోను ఉపయోగించుకోవడంపై పిటిఐ వార్తాసంస్థ ప్రశ్నించినప్పుడు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలోని పాకిస్తాన్ శాశ్వత దౌత్య కార్యాలయం కూడా వెంటనే స్పందించలేదు.

చిత్రం..గాజా యువతిని కాశ్మీరీగా చూపిస్తూ ఐరాస వేదికపై ప్రసంగిస్తున్న పాక్ ప్రతినిధి మలీహా లోధీ