అంతర్జాతీయం

రక్షణ బంధమే అజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 24: భారత్-అమెరికా రక్షణ సంబంధాలను మరింత ఎత్తుకు తీసుకెళ్లే ఉద్దేశంతో అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాట్టిస్ వచ్చే వారం భారత్‌లో పర్యటించనున్నారు. భరాత్‌కు ఎఫ్-16 యుద్ధ విమానాల విక్రయం, దక్షిణాసియా ప్రాంతంలో భద్రతా పరిస్థితిపై ఆయన ప్రధానంగా భారత నేతలతో చర్చించనున్నారు. మాట్టిస్ తన పర్యటనలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో చర్చలు జరపడంతోపాటుగా ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలుస్తారు. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశానికి చెందిన ఒక కేబినెట్ స్థాయి మంత్రి భారత్ పర్యటించడం ఇదే మొదటిసారి, భారత్-అమెరికా రక్షణ సంబంధాలను మరింత ఎత్తుకు పెంచడానికి అవసరమైన సంస్థాగత వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి, అఫ్గానిస్థాన్‌లో వ్యూహాత్మక సహకారాన్ని చాటిచెప్పడానికి ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర వాణిజ్యం, అంతర్జాతీయ చట్టాలను బలోపేతం చేయడానికి ఈ పర్యటనను మాట్టిస్ ఉపయోగించుకొంటారని, ఈ పర్యటన ఏర్పాట్ల గురించి తెలిసిన అధికారులు చెప్తున్నారు. ఈ నెల 26-27 తేదీల్లో జరిగే మాట్టిస్ పర్యటన సందర్భంగా రక్షణ రంగానికి సంబంధించి ఎలాంటి ఒప్పందాలను ప్రకటించే అవకాశం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఎఫ్-16, ఎఫ్-18ఏ యుద్ధ విమానాలకు సంబంధించి నిర్దిష్ట ప్రతిపాదనలపైన, అలాగే రక్షణ సహకారం, వాణిజ్య కార్యక్రమం కింద కొత్త ప్రాజెక్టులను గుర్తించడం జరగవచ్చని ఆ వర్గాలు తెలిపాయి. మాట్టిస్ పర్యటనకు ముందు సన్నాహకంగా అమెరికాలో భారత రాయబారి నవ్‌తేజ్ సర్నా శనివారం పెంటగాన్‌లో ఆయనను కలిశారు. సంప్రదాయానికి భిన్నంగా సర్నాను స్వాగతించడానికి మాట్టిస్ స్వయంగా రావడం విశేషం.