అంతర్జాతీయం

భారత్‌తో చర్చలకు పాకులాడటం లేదు: పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూన్ 6: పాకిస్తాన్‌తో సుహృద్భావ చర్చల ప్రక్రియ క్రమంగా మూసుకుపోతోందని, ఇందుకు ఎలాంటి సానుకూలత లేదంటూ భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేసిన ప్రకటనపై పాకిస్తాన్ ప్రధాని విదేశాంగ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ తీవ్రంగా స్పందించారు. భారత్‌తో చర్చలు జరపాలని తామెంత మాత్రం పాకులాడటం లేదని, చివరి క్షణంలో ఏదో సాకుతో తప్పించుకుంటున్నది ఆ దేశమేనని స్పష్టం చేశారు. గత ఏడాది డిసెంబర్ 9న భారత్-పాక్ చర్చలకు సిద్ధమైన వేళ పఠాన్‌కోట్ సంఘటన జరగడంతో మొత్తం వ్యవహారం మొదటికి వచ్చిందని సర్తాజ్ అజీజ్ పేర్కొన్నారు. దీన్నిబట్టి చర్చల నుంచి పాకిస్తాన్ పారిపోవడం లేదు, భారత దేశమే తప్పించుకుంటోందని ఆయన అన్నారు. కాశ్మీర్ సమస్యతోపాటు పలు కీలక అంశాలపై రెండు దేశాల మధ్య చర్చలు జరగాల్సిన అవసరం ఉందని, ఈ చర్చలు రెండు దేశాలకే గాక, ఆగ్నేయ ప్రాంత దేశాలకు సైతం అవసరమని ఆయన అన్నారు.