అంతర్జాతీయం

ఉగ్రవాదానికి భారత్ ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 24: భారత దేశం దురాక్రమణదారుగా ప్రవర్తిస్తోందని ఆరోపించిన పాక్, పొరుగు దేశాలయిన ఈ రెండు దేశాల మద్య ఉద్రిక్తతలు పెరిగిపోకూడదని ప్రపంచ దేశాలు గనుక కోరుకొంటున్నట్లయితే రెచ్చగొట్టే చర్యలను తక్షణం నిలిపివేయాలని భారత్‌ను కోరాలని పేర్కొంది. దక్షిణాసియాలో ఉగ్రవాదానికి పుట్టినిల్లు భారతేనని ఐక్యరాజ్య సమితిలో పాక్ రాయబారి మలీహా లోధీ ఆరోపిస్తూ తమ దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదాన్ని ఆ దేశం పెంచి పోషిస్తోందని ఆరోపించారు. పాకిస్తాన్ లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, హక్కానీ నెట్‌వర్క్‌లాంటి ఉగ్రవాద ముఠాలను సృష్టిస్తోందంటూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆరోపించిన తర్వాత ఆమె ప్రసంగానికి సమాధానమిచ్చే తన హక్కును లోధీ ఉపయోగించుకుంటూ, సుష్మాస్వరాజ్ తన ప్రసంగంలో ఉద్దేశపూర్వకంగానే ప్రధాన సమస్య అయిన కాశ్మీర్‌ను విస్మరించారని ఆరోపించారు. ‘్భరత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోకూడదని ప్రపంచ దేశాలు గనుక కోరుకుంటూ ఉంటే రెచ్చగొట్టే, దుందుడుకు చర్యలను ఆపేయాలని భారత్‌ను కోరాలి. అధీన రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలను అది మానుకోవాలి. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద ముఠాలను పెంచిపోషించడాన్ని అది విరమించుకొని తీరాలి’ అని లోధీ అన్నారు. మామూలుగా అయితే ఐక్యరాజ్య సమితిలో ఎవరు చేసే ఆరోపణలపైనైనా విదేశాంగ శాఖ కార్యాలయానికి చెందిన కిందిస్థాయి అధికారి స్పందించడం ఆనవాయితీ. అయితే భారత్‌కు వ్యతిరేకంగా పాక్ దౌత్యవేత్తే నేరుగా మాటల యుద్ధానికి దిగడం గమనార్హం. కాగా, లోధీ చేసిన ఆరోపణలకు సమాధానమిచ్చే హక్కును భారత్ వెంటనే ఉపయోగించుకోలేదు. అంతేకాదు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బలూచిస్థాన్‌లో జోక్యం చేసుకొంటున్నారని లోధీ తన ప్రసంగంలో ఆరోపించడం గమనార్హం. పాక్ ఈ ఆరోపణ చేయడం రెండోసారి.
ఏదయినా ఒక వివాదాన్ని ఇరుపక్షాలు గనుక పరిష్కరించుకోలేక పోయినప్పుడు జోక్యం చేసుకొని ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి తోడ్పడాల్సిన హక్కు, బాధ్యత ఐక్యరాజ్య సమితికి, ప్రపంచ దేశాలకు ఉందని లోధీ అన్నారు. ఐరాస తీర్మానాలకు గడువంటూ ఉండదని, సుష్మాస్వరాజ్ అన్నట్లుగా ఎవరు కూడా బలవంతంగా తీసేసుకోలేరని కూడా ఆమె అన్నారు. ఉగ్రవాదంపై సుష్మ చేసిన వ్యాఖ్యలను ఆమె ప్రస్తావిస్తూ ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదానికి ఒక నిర్వచనం ఇవ్వాలని, దానిలో ప్రభుత్వ ప్రోత్సాహిత ఉగ్రవాదాన్ని కూడా చేర్చాలని ఆమె అన్నారు. పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్‌లో భారత గూఢచార ఏజన్సీలు ప్రోత్సహిస్తున్న చర్యలను భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గొప్పగా చెప్పుకోవడాన్ని ప్రభుత్వ ప్రోత్సాహిత ఉగ్రవాదంగా ఈ సందర్భంగా ఆమె అభివర్ణించారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ను ఫాసిస్టు సిద్ధాంతాలు పాలిస్తున్నాయన్నారు.