అంతర్జాతీయం

ఫోకల్ పర్సన్‌ను నియమించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, సెప్టెంబర్ 24: ముంబయిపై ఉగ్రవాద దాడి కేసులో 24 మంది భారతీయుల వాంగ్మూలాలను నమోదు చేయడం కోసం వారిని ఇక్కడికి రప్పించాలని, ఈ విషయంపై కేంద్రీకరించడానికి ఒక ఫోకల్ పర్సన్‌ను నియమించాలని ఈ కేసులోని ఏడుగురు నిందితులను విచారిస్తున్న పాకిస్తాన్ కోర్టు ఫెడరల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్‌ఐఎ)ని ఆదేశించింది. ముంబయిపై దాడి సూత్రధారి జకీఉర్ రెహ్మాన్ లఖ్వీ, అబ్దుల్ వాజిద్, మఝర్ ఇక్బాల్, హమద్ అమీన్ సాదిక్, షాహిద్ జమీల్ రియాజ్, జమీల్ అహ్మద్, యూనిస్ అంజుమ్‌లు హత్యలకు, హత్యాప్రయత్నాలకు పురికొల్పినట్లు, దాడికి పథకం పన్ని అమలు చేసినట్లు అభియోగాలను ఎదుర్కొంటున్నారు. ఏడు సంవత్సరాలకు పైగా కాలం నుంచి కొనసాగుతున్న ఈ కేసు విచారణను ముగించడానికి భారత్‌కు చెందిన సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడం అవసరమని ప్రాసిక్యూషన్ తెలిపింది. ఈ కేసులో నిందితులను విచారించడానికి తగినన్ని ఆధారాలను ఇప్పటికే పాకిస్తాన్‌కు అప్పగించామని పేర్కొంటూ, అందువల్ల ఈ కేసు విచారణను వీలయినంత త్వరగా ముగించాలని భారత్ పాకిస్తాన్‌ను కోరుతూ వస్తోంది. ముంబయిపై దాడి కేసును పునఃదర్యాప్తు చేయాలని, జమాత్ ఉద్ దావా (జెయుడి) చీఫ్ హఫీజ్ సరుూద్‌ను ఈ కేసులో విచారించాలని భారత్ కోరుతోంది. సరుూద్ ప్రస్తుతం ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద ప్రస్తుతం లాహోర్‌లో గృహనిర్బంధంలో ఉన్నాడు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు గత వారం రావల్పిండిలోని అడియాలా జైలులో ముంబయిపై ఉగ్రవాద దాడి కేసును విచారించింది. ఈ సందర్భంగా ఈ కేసులోని భారత్‌కు చెందిన సాక్షులను కోర్టు ముందుకు రప్పించడానికి తగిన చర్యలు తీసుకునేందుకు ఒక ఫోకల్ పర్సన్‌ను నియమించాలని ఎఫ్‌ఐఎ డైరెక్టర్ జనరల్‌ను కోర్టు ఆదేశించింది.