అంతర్జాతీయం

భారీకాయురాలు ఎమన్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అబుదాబీ, సెప్టెంబర్ 25: ఇరవై మంది వైద్య నిపుణుల సమక్షంలో రేయింబవళ్లూ సేవలందించినా ఈజిప్టు మహిళ ఎమన్ అబ్దుల్ అత్తీ (37) ప్రాణాలు కాపాడలేకపోయారు. ప్రపంచ భారీకాయురాలు ఎమన్ సోమవారం ఇక్కడో ఆసుపత్రిలో మృతి చెందారు. బరువు తగ్గించుకునేందుకు ఆమెకు బెరియాట్రిక్ ఆపరేషన్ చేయించుకుంది. 500 కిలోల బరువున్న ఎమన్ అబుదాబీలోని బుర్జీల్ ఆసుపత్రిలో కన్నుమూశారు. గుండె అలాగే కిడ్నీ సంబంధిత సమస్యలతోపాటు ఆమెకు ఇన్‌ఫెక్షన్ సోకిందని వైద్యులు ప్రకటించారు. అధిక బరువుతో బాధపడుతున్న ఎమన్ ఫిబ్రవరిలో భారత్ వెళ్లింది. ముంబయిలోని సైఫీ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స చేశారు. అయితే తమ సోదరికి సరైన చికిత్స అందలేదంటూ ఎమన్ సోదరి షైమా ఆరోపించింది. సైఫీలో వైద్యులు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారంటూ సంచలనం సృష్టించింది. మొత్తానికి ఆమెను మే 4న భారత్ నుంచి అబుదాబీకి తీసుకొచ్చారు. బుర్జీ వైద్యులు కూడా ఆమె బరువు తగ్గిందని ప్రకటించారు. ఈ నెల 9న కుటుంబ సభ్యులతో కలిసి ఎమన్ 37వ బర్త్‌డే జరుపుకొన్నారు. వివిధ చికిత్సల తరువాత కోలుకుంటుందని భావిస్తున్న తరుణంలోనే ఆమె సోమవారం కన్నుమూసింది.