అంతర్జాతీయం

జపాన్ పార్లమెంట్ త్వరలో రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, సెప్టెంబర్ 25: జపాన్ పార్లమెంటును గురువారం రద్దు చేయనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు షింజో అబే సంచలన ప్రకటన చేశారు. పక్కనే ఉన్న ఉత్తర కొరియాతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో మరోసారి అధికారంలో కొనసాగడానికి వీలుగా అక్టోబర్‌లో పార్లమెంటు ఎన్నికలు నిర్వహించాలని అనుకొంటున్నట్లు అబే సోమవారం విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. ఎన్నికలు నిర్దిష్టంగా ఎప్పుడు జరుగుతాయో అబే చెప్పక పోయినప్పటికీ బహుశా అక్టోబర్ 22న ఉండవచ్చని భావిస్తున్నారు. అయిదేళ్లుగా అధికారంలో ఉన్న అబే ప్రతిపక్షాలు చీలిపోయి ఉన్న నేపథ్యంలో తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాతో అబే ఈ నిర్ణయం తీసుకొని ఉంటారని పరిశీలకులు అంటున్నారు. వరస కుంభకోణాల తర్వాత అబేకు ప్రజాదరణ పెరిగినట్లు తాజాగా నిర్వహించిన సర్వేలు సైతం వెల్లడించాయి. వాణిజ్య దినపత్రిక నిక్కీ గత వారాంతంలో నిర్వహించిన సర్వేలో 44 శాతం మంది అబేకు చెందిన ఉదారవాద లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి ఓటు వేస్తామని చెప్పగా కేవలం 8 శాతం మంది మాత్రమే ప్రధాన ప్రతిపక్షమైన డెమోక్రటిక్ పార్టీకి అనుకూలంగా ఓటు వేస్తామని చెప్పడం గమనార్హం. అంతేకాదు ఉత్తర కొరియా విషయంలో అబే అనుసరిస్తున్న కఠిన వైఖరికి కూడా అధిక సంఖ్యాకులు మద్దతు తెలపడం విశేషం. టోక్యో మేయర్ యురికో కొయికే కొత్త పార్టీ పెట్టబోతున్న ప్రకటించిన కొద్ది గంటలకే అబే పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలను దీటుగా ఎదుర్కోవడానికి చర్యలు తీసుకొంటామని అబే ప్రకటించారు. ఉత్తర కొరియా సరయిన మార్గంలో పయనిస్తే దానికి సాయం చేస్తామని, అయితే అది క్షిపణి పరీక్షలను ఆపకపోతే మాత్రం దానికి భవిష్యత్తు ఉండదని అబే హెచ్చరించారు.