అంతర్జాతీయం

ఉగ్రవాదులను రక్షిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 26: పాకిస్తాన్ ఇంటలిజెన్స్ బ్యూరోలో ముసలం పుట్టింది. ఈ సంస్థ ఉగ్రవాదులను రక్షిస్తోందంటూ ఓ సీనియర్ ఇంటలిజెన్స్ అధికారి ఏకంగా కోర్టులోనే పిటిషన్ వేశాడు. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన కోర్టును కోరినట్లుగా మీడియా కథనాలు వెలువడ్డాయి. పాకిస్తాన్ ఇంటలిజెన్స్ బ్యూరోలో ఎఎస్‌ఐగా పనిచేస్తున్న మాలిక్ ముఖ్తార్ అహ్మద్ అనే ఈ అధికారి తన సీనియర్ అధికారులపైనే తీవ్ర ఆరోపణలు చేశారు. ఉగ్రవాద అనుమానితులకు సంబంధించి తాను సమాచారం ఇచ్చినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తన పిటిషన్‌లో ఆరోపించారు. ఈ అంశాన్ని విస్తృత దర్యాప్తు కోసం ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్‌ఐ)కు నివేదించాలని కూడా ఇస్లామాబాద్ హైకోర్టును అభ్యర్థించినట్లుగా డాన్ పత్రిక వెల్లడించింది.