అంతర్జాతీయం

భారత్‌పై దాడులకు పాకిస్తాన్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూన్ 6: పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జమాత్ ఉద్ దవా (జెయుడి) ఉగ్రవాద సంస్థ అధినేత, కరడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సరుూద్ మరోసారి భారత్‌ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. భారత్ పాకిస్తాన్‌పై దాడికి దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని అతను హెచ్చరించాడు. ‘్భరత గడ్డ మీది నుంచి పాకిస్తాన్‌పైకి ద్రోన్ దాడులు జరిగితే, మొత్తం భారతదేశం మీద దాడి చేసేందుకు అవసరమైన ద్రోన్లు మా వద్ద ఉన్నాయి’ అని హఫీజ్ సరుూద్ ఇటీవల పాకిస్తాన్‌లో నిర్వహించిన ఒక ర్యాలీలో మాట్లాడుతూ వ్యాఖ్యానించినట్లు ఒక టివి న్యూస్ చానల్ తెలిపింది. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ, ఆ దేశ ఆర్మీ మద్దతు ఉన్న సరుూద్ భారత్‌కు వ్యతిరేకంగా దాడులు నిర్వహించేందుకు కొంతకాలం క్రితం ఉగ్రవాదుల నియామకాలను ప్రారంభించాడు. భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో గల వివిధ లాంచింగ్ ప్యాడ్‌లను సరుూద్ ఇటీవల సందర్శించినట్లు సమాచారం. ఈ లాంచింగ్ ప్యాడ్‌ల వద్ద నుంచే ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడుతుంటారు. భారత్ అంతర్జాతీయ సరిహద్దుల్లో తాజాగా లేజర్ వాల్స్‌ను నిర్మిస్తుండటంతో జెయుడి ఈ వేసవిలో భారత భూభాగంలోనే మిలిటెంట్ల నియామకాలను నిర్వహించినట్లు సమాచారం. రెండు రోజుల పాటు సరిహద్దుల్లో ఉన్న సరుూద్ కనీసం పది గ్రామాల్లో రెచ్చగొట్టే ప్రసంగాలు ఇచ్చినట్లు సమాచారం.