అంతర్జాతీయం

ఆయనేమన్నా ప్రపంచ నాయకుడా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాస, సెప్టెంబర్ 26: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను ప్రపంచానికే రాజునని భావిస్తున్నారని వెనిజులా ధ్వజమెత్తింది. ఐరాస జనరల్ అసెంబ్లీలో వెనిజులా విదేశాంగ మంత్రి జోర్గే అర్రెజా మాట్లాడుతూ ట్రంప్‌పై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. వెనిజులా అధికారుల పర్యటనపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఐరాస సర్వసభ్య వార్షిక సమావేశంలో ప్రపంచ దేశాల నేతల వద్ద ట్రంప్‌పై నిప్పులు చెరిగారు. ‘ట్రంప్ ప్రపంచానికే ఓ రాజులా ఊహించుకుంటున్నారు’ అని జోర్గే ఆరోపించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు నిజంగా పెద్దన్న పాత్ర పోషించాలని భావిస్తే ఓ వేదికను ఏర్పాటు చేసి శాంతి స్థాపనకు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉత్తర కొరియా చర్యలను ఎదుర్కొనలేక మిగతా దేశాలపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.