అంతర్జాతీయం

వచ్చేనెల 2న షరీఫ్‌పై చార్జిషీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 26: పనామా పత్రాల కుంభకోణానికి సంబంధించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై అక్టోబర్ 2న చార్జిషీట్ నమోదు చేయాలని పాకిస్తాన్‌కు చెందిన అవినీతి వ్యతిరేక కోర్టు మంగళవారం నిర్ణయించింది. పనామా పత్రాల కుంభకోణంలో అవినీతి ఆరోపణలను ఎదుర్కోవడం కోసం లండన్‌నుంచి వచ్చిన షరీఫ్ మంగళవారం తొలిసారిగా కోర్టు ముందు హాజరయ్యారు. షరీఫ్ పిల్లలు హసన్, హుస్సేన్, మరియమ్, అల్లుడు కెప్టెన్ సఫ్దర్‌లకు బెయిలుకు వీలుండే అరెస్టు వారెంట్లను కూడా కోర్టు జారీ చేసింది. బెయిలు పొందడానికి ఒక్కొక్కరు పది లక్షల రూపాయల స్యూరిటీ బాండ్లను సమర్పించాలని కూడా కోర్టు వారిని ఆదేశించింది. గత జూలై 28న పాకిస్తాన్ సుప్రీంకోర్టు నవాజ్ షరీఫ్ ప్రధాని పదవిలో కొనసాగడానికి అనర్హుడిగా ప్రకటించడంతో ఆయన పదవినుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. షరీఫ్‌పైన, ఆయన పిల్లలపైన అవినీతి కేసులు దాఖలు చేయాలని కూడా అప్పుడు న్యాయస్థానం ఆదేశించింది.
కాగా, అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య వద్ద ఉండడానికి లండన్ వెళ్లిన నవాజ్ షరీఫ్ సోమవారం పాక్‌కు తిరిగివచ్చారు. ఆయన మంగళవారం ఇస్లామాబాద్‌లోని జ్యుడీషియల్ కాంప్లెక్స్‌లో ఉన్న పూచీకత్తు కోర్టు ముందు హాజరయ్యారు. తన భార్య ఆరోగ్యం బాగా లేదని, తాను ఆమెను చూసుకోవలసిన అవసరం ఉందని షరీఫ్ కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు ఆయన వెళ్లడానికి అనుమతించింది. అనంతరం పది నిమిషాలపాటు విచారణ వాయిదా వేసిన తర్వాత కోర్టు విచారణను తిరిగి కొనసాగించింది. అనంతరం షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ తాను ఏ తప్పూ చేయలేదని పునరుద్ఘాటించారు. భగవంతుడిపై తనకు నమ్మకం ఉందని, పాకిస్తాన్ ప్రజలు తన వెంటే ఉన్నారని అన్నారు. ఇంకా న్యాయం జీవించే ఉందని నమ్ముతున్నానని కూడా అన్నారు. దేశంకోసం తాను త్యాగాలను కొనసాగిస్తానన్నారు. తనపై తప్పుడు కేసులు మోపారని, అయినా తాను తలవంచేది లేదని స్పష్టం చేశారు.

చిత్రం..భారీ బందోబస్తు నడుమ మంగళవారం కోర్టుకు హాజరైన పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్