అంతర్జాతీయం

ఇరాక్‌లో ఆత్మాహుతి దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగ్దాద్, జూన్ 9: ఇరాక్‌లో గురువారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 27 మంది మృతిచెందగా డజన్లకొద్దీ గాయపడ్డారు. బాగ్దాద్‌లోని ఒక వాణిజ్య ప్రాంతంలో శక్తివంతమైన బాంబు పేలడంతో 15 మంది మృతిచెందగా, 35 మంది గాయపడ్డారు. తాజీ పట్టణంలో ఆర్మీ చెక్‌పోస్టు వద్ద జరిగిన మరో ఆత్మాహుతి దాడిలో 12 మంది మృతిచెందారు. వీరిలో ఐదుగురు ఆర్మీ జవాన్లు కాగా, ఏడుగురు పౌరులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో మరో 28 మంది గాయపడ్డారని వారు తెలిపారు. తాజా దాడులకు తామే కారణమని ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ ప్రకటించుకుంది. బాగ్దాద్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, భద్రతా దళాలు, షైట్ తెగవారిని టార్గెట్ చేసుకుని ఆత్మాహుతి దాడికి తెగబడినట్లు పోలీసులు భావిస్తున్నారు. గత నెలలో ఫల్లూజా నుంచి ఐఎస్ ఉగ్రవాదులను ఇరాకీ సైన్యం తరిమివేసిన తర్వాత ఉగ్రవాదులు రోజూ ఏదో ఒకచోట బాంబు పేలుళ్లకు పాల్పడుతున్నారు.