అంతర్జాతీయం

అది అల్ షబాబ్ పనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొగదిషు, అక్టోబర్ 16: కల్లోల సోమాలియా చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో జరిగిన ఓ భయానక బాంబు విస్ఫోటన సంఘటనలో మరణించిన వారి సంఖ్య 276కు చేరింది. అలాగే ఈ ఘటనలో గాయపడినవారి సంఖ్య 300కు పైనే ఉందని, వీరిలో చాలామంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని దేశ సమాచార శాఖ మంత్రి అబ్దిరహమాన్ ఉస్మాన్ సోమవారం నాడిక్కడ తెలిపారు.
ఒకే బాంబు పేలుడు సంఘటనలో ఇంతమంది మరణించడమన్నది ఆఫ్రికా దేశ చరిత్రలో ఇదే ప్రథమమని, ఇది అత్యంత ఘోరమైన, ఆటవిక సంఘటన అని ఆయన అభివర్ణించారు. ఈ సంఘటనపై స్పందించిన టర్కీ, కెన్యా తదితర దేశాలు వైద్యపరంగానూ, ఇతరత్రానూ సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చాయని ఆయన వెల్లడించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ సహా అనేక ప్రభుత్వ భవనాల కూడలి సమీపంలో జనసమ్మర్దంగా ఉన్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఈ ట్రక్ బాంబు దాడి జరిగిందని ఆయన వెల్లడించారు. సమీపంలోని ఆస్పత్రులన్నీ మృతదేహాలతోనూ, క్షతగాత్రులతోనూ నిండిపోయాయని తెలిపారు. ఈ దాడి వెనుక అల్‌ఖైదాతో సంబంధం ఉన్న అల్ షబాబ్ అనే ఉగ్రవాద సంస్థ హస్తం ఉందని సోమాలియా ప్రభుత్వం ప్రకటించింది. అదేస్థాయిలో ఈ సంఘటనను జాతీయ విపత్తుగా కూడా వెల్లడించింది. కాగా, ఈ ట్రక్కు బాంబు దాడితో తమకు సంబంధం ఉందన్న ఆరోపణలతో ఈ తీవ్రవాద సంస్థ ఇంతవరకు స్పందించలేదు. తమపై దాడులు జరుపుతామని సోమాలియా కొత్త అధ్యక్షుడు, అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో తమ దాడులను విస్తృతం చేస్తామని అల్ షబాబ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈ తాజా దాడి వెనుక ఆ ఉగ్రవాద సంస్థ హస్తం ఉండవచ్చునన్న ఆరోపణలు వస్తున్నాయి. 2015లో కెన్యాలోని గారిస్సా యూనివర్శిటీపై, 1998లో కెన్యా, టాంజానియాల్లో అమెరికా ఎంబసీలపై జరిగిన దాడికంటే కూడా మొగడిషు బాంబు అత్యంత హేయమైనదని చెబుతున్నారు.
సోమాలియాను ఆదుకుంటాం: ఐరాస
సోమాలియాలో జరిగిన బాంబుదాడిని అత్యంత హేయమైనదిగా, ఆటవికమైనదిగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా ప్రపంచ దేశాలన్నీ తీవ్ర స్వరంతో ఖండించాయి. తాజా పరిస్థితిని ఎదుర్కోవడంలో సోమాలియా ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అమెరికా విదేశాంగ విభాగం ప్రకటించింది. శాంతి, భద్రతల పరిరక్షణకు, అదేవిధంగా అంతర్జాతీయ మిత్ర దేశాలతో కలిసి ఉగ్రవాద నిర్మూలనకు అంకితభావంతో కృషి చేస్తామని వెల్లడించింది. సోమాలియా దాడి పిరికిపంద చేష్టగా బ్రిటన్ విదేశాంగ మంత్రి బోరిస్ జాన్సన్ ఖండించారు. సోమాలియాకు సంఘీభావం ప్రకటించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రన్ ఉగ్రవాద గ్రూపులను అణచివేయడంలో ఆఫ్రికా యూనియన్‌కు పూర్తిస్థాయిలో తోడ్పడతామన్నారు. ఈ మిలిటెంట్ దాడిని తిరుగుబాటు చర్యగా సోమాలియాలోని ఐరాస ప్రత్యేక రాయబారి మైఖేల్ కీటింగ్ అభివర్ణించారు. ఈ ఆపత్సమయంలో సోమాలియా ప్రభుత్వాన్ని ఇటు ఐరాస, అటు ఆఫ్రికా యూనియన్ దేశాలు ఆదుకుంటాయని, వైద్యపరంగానూ, రవాణాపరంగానూ అన్నివిధాలుగా తోడ్పాటునందిస్తామని తెలిపారు.

చిత్రం..ట్రక్కు బాంబు దాడి తీవ్రతకు నేలకొరిగిన భవనం. మృతదేహాలను తరలిస్తున్న సిబ్బంది