అంతర్జాతీయం

హఫీజ్ గృహనిర్బంధం మూడు నెలలు పొడిగింపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, అక్టోబర్ 17: ముంబయిపై ఉగ్రదాడికి సూత్రధాని హఫీజ్ సరుూద్ గృహనిర్బంధాన్ని పంజాబ్ ప్రభుత్వం పొడిగించనుంది. ప్రజాభద్రతా చట్టం కింద ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద జనవరి నుంచి జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ తదితరులు గృహనిర్బంధంలో ఉంటున్నారు. మంగళవారం హఫీజ్‌ను భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ముగ్గురు సభ్యులుగల ప్రొవెన్షియల్ జుడీషియల్ రివ్యూబోర్డు ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తులు యవర్ అలీ, అబ్దుల్ సమీ, అలియా నీలంతో కూడిన బోర్డు ఎదుటు వాదనలు వినిపించారు. హఫీజ్ అతడి అనుచరులు నలుగురుకి గృహనిర్బంధం పొడిగించాలంటూ పంజాబ్ ప్రభుత్వ హోమ్‌శాఖ అధికారి కమిటీ ఎదుట వాదనలు వినిపించారు. హఫీజ్, అబ్దుల్లా అబైద్, మాలిక్ జాఫర్ ఇక్బాల్, అబ్దుల్ రెహ్మాన్ అబిద్, ఖాజీ కషీఫ్ హుస్సేన్‌ల గృహనిర్బంధం గడువు ఈ నెల 24తో ముగియనుంది. హఫీజ్‌తోపాటు నలుగురి గృహనిర్బంధాన్ని మరో పొడిగించేందుకు జుడీషియల్ రివ్యూ బోర్డు ఆమోదం తప్పనిసరి.