అంతర్జాతీయం

ఐపికెఎఫ్‌కు ఐరాస అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాస, అక్టోబర్ 17: దక్షిణ సూడాన్‌లో విధులు నిర్వర్తిస్తున్న 50 మంది సభ్యులుగల భారత శాంతి రక్షక దళానికి ఐక్యరాజ్య సమితి పతకం లభించింది. అనిశ్చిత పరిస్థితులో కల్లోలంగా మారిన దక్షిణ సూడాన్‌లో ప్రజలకు భద్రత కల్పించడం, శాంతిని నెలకొల్పడంతో ఇండియన్ పీస్ కీపింగ్ టీమ్ (ఐపికెఎఫ్) అంకితభావంతో పనిచేస్తోంది. వారి సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును ఇచ్చారు. యుఎన్ మిషన్ ఇన్ సౌత్ సూడాన్ (యుఎన్‌ఎంఐఎస్‌ఎస్)తో కలిసి భారత బృందం అక్కడ విధులు నిర్వర్తిస్తోంది. దక్షిణ సూడాన్‌లోని జొంగ్లయి ప్రాంతంలో బోర్‌లో ఇండియన్ బెటాలియన్ ఏర్పాటైంది. ఇటీవలే భారత శాంతి పరిరక్షక దళానికి యుఎన్‌ఎంఐఎస్‌ఎస్ కమాండర్ జనరల్ ఫ్రాంక్ ముషాయో కమాంజీ అవార్డును ప్రదానం చేశారు. ‘జొంగ్లయిలో పౌరుల రక్షణకు, శాంతిని నెలకొల్పడానికి భారత దళం భేషయిన సేవలు అందిస్తోంది. వారి ధైర్యసాహసాలు, విధి నిర్వహణలో అంకితభావం మరువలేం’ అని ఫ్రాంక్ ప్రశంసలు కురిపించారు. జొంగ్లయి స్థానిక ప్రభుత్వం కూడా ఇండియన్ పీస్ కీపర్స్‌ను పొగడ్తలతో ముంచెత్తింది.