అంతర్జాతీయం

హిల్లరీ.. మళ్లీ పోటీచేస్తావా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 17: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (2016) డెమొక్రాట్స్ అభ్యర్థిగా అనూహ్య విజయం సాధించిన డొనాల్డ్ ట్రండ్, ప్రత్యర్తి హిల్లరీ క్లింటన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2020లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ హిల్లరీ క్లింటన్ పోటీ చేస్తుందేమో. అదే జరిగితే నామీదే పోటీ చేయాలి.. అంటూ వ్యంగ్య బాణాలు సంధించారు. అధ్యక్ష ఎన్నికల్లో తన అపజయానికి కారణం బయటి శక్తులేనంటూ కొద్దిరోజుల క్రితం ఓ కార్యక్రమంలో హిల్లరీ క్లింటన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం తెలిసిందే. ఈ వ్యాక్యలపై వైట్ హౌస్‌లో జరిగి మీడియా కాన్ఫరెన్స్‌లో డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రతి స్పందించారు. ‘హిల్లరీ బలహీనమైన అభ్యర్థి. అయినా వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారు. చేస్తుందనే అనుకుంటున్నా. హిల్లరీ, ప్లీజ్ నా మీద మళ్లీ ఒకసారి పోటీ చేయవా’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘ఎన్నికల్లో ఆమె ఓటమికి ఎన్నో కారణాలున్నాయి. ఆమె చేసిన పనుల్లో ఒక్కటీ మంచి పని లేదు. అదీ ఓ కారణమే’నంటూ హిల్లరీ ఓటమిని ట్రంప్ విశే్లషించారు. జాతీయ గీతానికి జరిగిన అవమానం విషయంలో ఎన్‌ఎఫ్‌ఎల్ ఆటగాళ్లను ఆమె వెనుకేసుకు రావడం మరో కారణమన్నారు. ఆ సమయంలో ఆమె ప్రకటన చూస్తే చాలు ‘మన జాతీయ గీతం పట్ల ఆమెకు ఎంత గౌరవం ఉందో’ అంటూ వ్యాఖ్యానించారు. అందులోనూ ఎన్‌ఎఫ్‌ఎల్ ఆటగాళ్ల విషయంలో అమెరికన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ విషయాన్ని ఎప్పుడూ లేనంతగా ఖాళీగావున్న స్టేడియంలే రుజువుచేశాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రకటన చేసేటపుడు కాస్త జాగ్రత్తవహించి ఉండాల్సింది అంటూ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తన ఓటమికి రష్యా కూడా కారణమంటూ క్లింటన్ వ్యాఖ్యానించడం క్షమించరానిదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ‘ఏ కోణంలో చూసినా ఆమె ఓటమిని అనేక కారణాలు. అందులో ఆమె కూడా ఓ భాగం’ అంటూ నర్మగర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు.