అంతర్జాతీయం

నవశకంలోకి చైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వైపాక్షిక వివాదాలకు చర్చల పరిష్కారం
నిజాయితీగా చేయి చాపితే ఎవరితోనైనా చెలిమి
తిరుగులేని సైనిక శక్తికి మనమే చిరునామా
19వ సిపిసి కాంగ్రెస్ సమావేశాల్లో జిన్ పింగ్

బీజింగ్, అక్టోబర్ 18: పొరుగు దేశాలతో ద్వైపాక్షిక వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు చైనా సిద్ధంగా ఉందని అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రకటించారు. అయితే, ఆ పరిష్కారాలు చైనా వ్యూహాత్మక ప్రయోజనాలకు లోబడి ఉండాలని స్పష్టం చేశారు. చైనాలో అప్రతిహత నాయకుడిగా ఎదిగిన జీ జిన్ పింగ్, బుధవారం నుంచి మొదలైన అధికార కమ్యూనిస్ట్ పార్టీ ప్రత్యేక సమావేశాలను ప్రారంభించారు. ఐదేళ్లకోసారి నిర్వహించే సిపిసి కాంగ్రెస్ సమావేశాలను వచ్చే మంగళవారం వరకూ నిర్వహిస్తారు. సిపిసి 19వ సమావేశాలకు పార్టీ అగ్రనేతలు మాజీ అధ్యక్షులు వెన్ జిబావో, జియాంగ్ జెమిన్, హు జింటావో సహా పలువురు కీలక నేతలు హాజరై పార్టీ పటిష్టతను ప్రదర్శించారు. వారంపాటు జరిగే సమావేశాల్లో పార్టీకి సంబంధించి కీలక సంస్కరణలు చేపట్టనున్నారు. ఈ సమావేశాల్లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సర్వాధికారి హోదాలో మూడున్నర గంటలపాటు సుదీర్ఘ ఉపన్యాసం చేసిన గ్జి జిన్ పింగ్, చైనా కొత్తశకంలోకి అడుగుపెడుతుందని హర్షద్వానాల మధ్య ప్రకటించారు. చైనా మిలటరీని బలోపేతం చేస్తామని, తాను చేపట్టిన అవినీతి రహిత చైనా నిర్మాణానికి మరింత మద్దతు కావాలని కోరారు. ఈ చర్యలను సాకారం చేసుకుంటే ‘చైనా సామ్యవాదంలో కొత్తశకం మొదలైనట్టే’ అని అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్ పిలుపునిచ్చారు. ‘ఇతరుల ప్రయోజనాలు దెబ్బతీయలన్న ఆలోచన చైనాకు ఎప్పుడూ లేదు. అలాగని, చైనా హక్కులు, ప్రయోజనాలకు దెబ్బతగిలే పరిస్థితి వస్తే చూస్తూ ఊరుకోదు. స్వప్రయోజనాల కోసం డ్రాగన్ ఎవరినైనా మింగేస్తుందన్న భావనలు ఎవ్వరికీ అవసరం లేదు’ అని 2300 మంది అతిధులు హాజరైన సమావేశంలో గంభీరంగా ప్రకటించారు. పొరుగు దేశాలతో చైనా బాంధవ్యం, వ్యాపార భాగస్వామ్యమంతా ఆయా దేశాల స్నేహం, నిజాయితీ, పరస్పర లాభం, విధానపైమైన అంశాల ఆధారంగానే ఉంటుందని ప్రకటించారు. ‘ద్వైపాక్షిక వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకుందాం. సామరస్యం, పరస్పర సహకారంతోనే విభేదాలకూ ఫుల్‌స్టాప్ పెడతాం. ప్రపంచాన్ని భయపెడుతున్న ఉగ్రమూకల నిరోధానికి సంప్రదాయ, సంప్రదాయేతర రూపాల్లో సహకారం అందిద్దాం’ అని జిన్ పింగ్ స్పష్టం చేశారు. అయితే, సిక్కిం సరిహద్దుల్లో భారత్‌తో తలెత్తిన డొక్లాం వివాదాన్ని ప్రత్యక్షంగా ప్రస్తావించకుండానే, పరోక్షంగా డ్రాగన్ ధోరణిని వెల్లడించారు. చైనా అనుసరిస్తున్న దీర్ఘకాలిక ప్రణాళికలు 2020నాటికి దేశానికి అత్యన్నత సాంకేతిక సామర్థ్యం అందించబోతున్నాయని ప్రకటించారు. ‘ఇప్పటికే ప్రపంచంలోనే అత్యున్నతస్థాయి మిలటరీని చైనా కలిగి ఉంది. 2035 నాటికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలటరీ దేశంగా ఆవిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’ అని హర్షధ్వానాల మధ్య జిన్ పింగ్ ప్రకటించారు. ‘సాధారణంగా యుద్ధం కోసమే ఏ దేశమైనా సైన్యాన్ని సిద్ధం చేసుకుంటుంది. కానీ, చైనా సైన్యం అనితర సామర్థ్యాలు కలిగిన శక్తి. దేశ పటిష్టతకు వెనె్నముకగా నిలవడమే కాదు, కయ్యానికి ఎవరైనా కాలు దువ్వితే తగిన సమాధానం చెప్పగల నైపుణ్య యుక్తి’ అని జిన్‌పింగ్ ప్రశంసలు కురిపించారు.