అంతర్జాతీయం

వైట్‌హౌస్‌లో దీపావళి నిర్వహించిన ట్రంప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 18: కొంతకాలంగా అమెరికా అధ్యక్షులు కొనసాగిస్తున్న సంప్రదాయానే్న ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం కొనసాగించారు. వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు నిర్వహించి, తన యంత్రాంగంలో కీలక పదవుల్లోవున్న భారతీయ- అమెరికన్లతో కలిసి పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఫేస్‌బుక్‌లో వీడియోను పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన, బలమైన ప్రజాస్వామ్యానికి పునాదులు వేసిన భారతీయుల సంప్రదాయాన్ని మనం గౌరవిద్దాం. శాస్త్రం, వ్యాపారం, విద్యలాంటి అనేక రంగాల్లో అమెరికా సాధించిన ప్రగతిలో భారతీయ -అమెరికాన్లు కీలక భాగస్వాములు. వాళ్ల సేవలను ఎప్పటికీ మరువలేం’ అంటూ ట్రంప్ పండుగ శుభాకాంక్షలు ప్రకటించారు. వైట్‌హౌస్‌లోని ఓవల్ కార్యాలయంలో పెద్దఎత్తున నిర్వహించిన దీపావళి వేడుకలకు ట్రంప్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న భారతీయ -అమెరికన్లు హాజరయ్యారు. ఐరాసకు అమెరికా రాయబారిగావున్న నిక్కీ హేలీ, కేంద్ర వైద్య విభాగానికి అత్యున్నత పదవిలోవున్న సీమా వర్మ, యుఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ చైర్మన్ అజిత్ పాయ్, ట్రంప్ ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ రాజ్ షా తదితరులు వైట్‌హౌస్‌లోని దీపావళి వేడుకలకు హాజరయ్యారు. వీరితోపాటు అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా సైతం వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచినట్టు వైట్‌హౌస్ విడుదల చేసిన ఫొటోలను బట్టి తెలుస్తోంది. ‘మీరు కళ, శాస్త్రం, వైద్యం, వ్యాపారం, విద్యారంగాల్లో ఎనలేని కృషి చేశారు. అమెరికా మిలటరీలోవున్న భారతీయ -అమెరికన్లు ధైర్య సాహసాలను మాటల్లో చెప్పలేను. అమెరికా ఘన ఖ్యాతికి మీరు అందించిన సేవలు అద్వితీయం, నిరుపమానం. హిందూ సంప్రదాయమైన దీపావళి వేడుకలను శే్వతసౌధంలో సంబరంగా జరుపుకున్న సంఘటన నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. అమెరికా పాలనా యంత్రాంగంలోవున్న భారతీయ అమెరికన్లు, అమెరికాలో లక్షలాదిగావున్న భారతీయులే కాదు, భారత్‌లోను, ప్రపంచం నలుమూలలావున్న భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ట్రంప్ వ్యాఖ్యానించారు.
వైట్‌హౌస్‌లో దీపావళి నిర్వహించడం జార్జి బుష్ హయాంలోనే ప్రారంభమైనా, గత అధ్యక్షుడు బారక్ ఒబామా హయాంలో పెద్దఎత్తున దీపావళి నిర్వహించారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ సైతం అదే సంప్రదాయాన్ని కొనసాగించి ప్రపంచంలోని భారతీయలు అందరికీ శుభాకాంక్షలు ప్రకటించారు.