అంతర్జాతీయం

భారత్-యుఎఇ మధ్య తిరుగులేని బంధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయి, అక్టోబర్ 20: భారత్-యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలున్నాయని, ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు ఎలాంటి సమస్య లేకుండా అమలుకావడానికి ఇదే కారణమని భారత రాయబారి నవదీప్‌సింగ్ సూరి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా భారత్-యుఎఇ మధ్య కుదిరిన అనేక ఒప్పందాల గురించి ఆయన మాట్లాడారు. భారత జాతీయ పెట్టుబడులు, వౌలిక సదుపాయాల నిధి(ఎన్‌ఐఐఎఫ్), అబుదాబీ పెట్టుబడులు అథారిటీ(ఎడిఐఎ) మధ్య ఒక బిలయన్ డాలర్ల ఒప్పందంతోపాటు ఇరుదేశాల మధ్య ఎన్నో ఒప్పందాలపై సంతకాలు జరిగాయని ఆయన తెలిపారు. అలాగే వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కూడా అవగాహనా ఒప్పందాలు కుదిరియాని పేర్కొన్న ఆయన ఇవన్నీ కూడా వాస్తవంగా అమలయ్యేలా ఇరుదేశాలు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నాయని వెల్లడించారు.
అలాగే ఇతరాత్ర కూడా రెండు దేశాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారం కూడా జరుగుతోందని పేర్కొన్న ఆయన అబుదాబీలో ఇటీవల జరిగిన ప్రపంచ నైపుణ్య శిఖరాగ్ర సదస్సులో భారత్ నుంచి 100 డెలిగేట్లు పాల్గొన్నారని సూరి గుర్తుచేశారు. వీటిలో కేంద్ర, రాష్ట్ర ప్రతినిధలు కూడా ఉన్నారని రాయబారి అన్నారు. అలాగే గల్ఫ్ సమాచార టెక్నాలజీ ప్రదర్శలో వందకు పైగా భారతీయ కంపెనీలు పాల్గొన్నట్టు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇటు మంత్రుల పర్యటనలతోనూ కుదుర్చుకున్న ఒప్పందాల అమలుతోనూ భారత్-యుఎఇలు బలమైన సుహృద్భావంతో ముందుకెళ్తున్నాయని వెల్లడించారు.