అంతర్జాతీయం

మాకు తుపాకీ ఉండాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 20: అమెరికాలో తుపాకీ సంస్కృతి పెచ్చరిల్లుతున్న తరుణంలో ఆదేశంలో ఏకంగా 30 లక్షల మంది పౌరులు లోడెడ్ హ్యాండ్ గన్స్‌ను నిత్యం కలిగి ఉంటారంటూ తాజాగా విడుదలైన ఓ సర్వే స్పష్టం చేసింది. మరో తొమ్మిది లక్షల మంది నెలవారీగా ఈ తుపాకీలను కలిగి ఉంటారని ఈ సర్వే తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన ప్రజాస్వామ్య దేశంగా భావిస్తున్న అమెరికాలో ఇన్ని లక్షల మంది రోజువారీగా తుపాకులను జేబులో పెట్టుకుని తిరగడం అన్నది దిగ్భ్రాంతికలిగించే విషయమేనైనా‘ఆత్మ రక్షణ కోసమే తుపాకులను వినియోగించుకోవల్సి వస్తుంది’అని ఈ సంస్కృతిని సమర్ధిస్తున్న వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గత 20 ఏళ్లుగా ఎన్నడూ లేని విధంగా అమెరికాలో ఎంత మంది వద్ద తుపాకులు ఉన్నాయి? ఎంత తరచూ వారు వినియోగిస్తున్నారు అలాగే వేటికోసం ఆ తుపాకులను కలిగి ఉన్నారన్నదానిపై తొలిసారిగా ఈ విస్తృత సర్వే జరిగింది. ఆయా రాష్ట్రాల చట్టాలకు అనుగుణంగానే ఈ రకంగా తుపాకులను కలిగి ఉండడాన్ని అనుమతి ఇస్తున్నారని తెలిపింది. బహిరంగ స్థలాల్లో తుపాకులను తీసుకెళ్లడం అన్నది ప్రజాభద్రతకు, ఆరోగ్యానికి హానికరమని వాషింగ్టన్ వర్శిటీ ప్రొఫెసర్ అలీ రోహానీ రాబర్ హెచ్చరిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఈ సంస్కృతిపైనా దాని పర్యవసానాలపైనా అధ్యయనం జరగాలని అదే విధంగా ఇలా తుపాకులతో తిరుగుతున్న వారి ప్రవర్తన, లక్షణాలను కుడా ప్రజాభద్రత దృష్ట్యా పరిశీలించడం ఎంతో అవసరమని ఆయన అన్నారు. తుపాకులతో తిరుగుతున్న పౌరుల్లో యువత సంఖ్యే ఎక్కువని వారిలో మగవారి సంఖ్య మరీ ఎక్కువని ఈ సర్వే తెలిపింది. వీరందరూ కూడా ఎక్కువగా దక్షిణ అమెరికాలోని రాష్ట్రాల్లోనే నివసిస్తున్నారని పేర్కొంది. అంతేకాకుండా ఇక్కడ పౌరులందరూ కూడా సొంతగా తుపాకులున్న సంస్కృతిలోనే పెరిగారని వీరిలో ఒకటి కంటే ఎక్కువ తుపాకులు ఉన్న దాఖలాలు కూడా ఉన్నాయని పరిశోధకులు స్పష్టం చేశారు. 2015లో ఈ అంశంపై జాతీయ స్థాయిలో జరిగిన సర్వే వివరాల ఆధారంగా మొత్తం 14 వందల 44 మంది తుపాకీ యజమానల ప్రవర్తన, లక్షణాల తీరుతెన్నులను కూడా పరిగణలోకి తీసుకుని విశే్లషించారు. వీరిలో 66 శాతం మంది తాము నిత్యం పైకి కనిపించకుండా తుపాకులతోనే తిరుగుతామని వెల్లడించగా మరో 10 శాతం మంది తాము బాహాటంగానే వీటిని ప్రదర్శిస్తామని స్పష్టం చేసినట్టు తెలిపారు.