అంతర్జాతీయం

మోదీ కోసం కారు నడిపిన మెక్సికో అధ్యక్షుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెక్సికో సిటీ, జూన్ 9: అయిదు దేశాల పర్యటనలో భాగంగా గురువారం మెక్సికో చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం లభించింది. ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన అనంతరం మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పినా నీటో మోదీ ఉన్న కారును స్వయంగా నడిపారు. వాళ్లిద్దరూ కారులో ‘క్వింటోనిల్’ అనే రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ మోదీతో కలిపి నీటో శాకాహార భోజనం చేశారు.
మోదీ ఉన్న కారును నీటో నడుపుతున్న ఫోటోలను విదేశాంగ శాఖ కార్యదర్శి వికాస్ ట్విట్టర్‌లో ఉంచారు. వాళ్లిద్దరూ రెస్టారెంట్‌లో ఒక టేబుల్ వద్ద కూర్చుని మాట్లాడుకుంటున్న ఫోటోలను కూడా ఆయన ట్విట్టర్‌లో ఉంచారు. కాగా మెక్సికో సిటీలో మోదీకి భారతీయ సంతతికి చెందినవారినుంచి సాదర స్వాగతం లభించిందని కూడా ఆయన తెలిపారు. కాగా, మెక్సికోలో తనకు లభించిన స్వాగతానికి మోదీ సైతం ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలియజేశారు.
అంతకుముందు నీటో కూడా ప్రధాని మోదీని తమ దేశానికి ఆహ్వానించడం తనకు లభించిన గౌరవమని ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. గత 30 ఏళ్లలో భారత ప్రధాని ఒకరు మెక్సికోలో పర్యటించడం ఇదే మొదటిసారి. గతంలో 1986లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆ దేశంలో పర్యటించారు.

చిత్రం ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి భోజనం చేస్తున్న మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పినా నీటోతో