అంతర్జాతీయం

ఆ ఒక్కటీ తప్ప..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, అక్టోబర్ 21: భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో కుల్‌భూషణ్ జాదవ్ విషయం చర్చించినట్టు మీడియాలో వచ్చిన కథనాలను పాకిస్తాన్ ప్రభుత్వం కొట్టిపారేసింది. ‘మా హైకమిషనర్ సొహైల్ మహమూద్ భారత విదేశాంగ మంత్రితో భేటీ అయ్యారన్న విషయం వాస్తవమే. అయితే ఇద్దరి మధ్య జాదవ్ విషయం చర్చకు వచ్చిందన్న కథనాలు వట్టిదే’ అని పాక్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వివరణ ఇచ్చింది. కుల్‌భూషణ్ జాదవ్‌పై బనాయించిన కేసులన్నీ ఎత్తివేస్తేనే ద్వైపాక్షిక సంబంధాలుంటాయని సుష్మాస్వరాజ్ అన్నట్టు మీడియాలో వచ్చిన కథనాలు అభూతకల్పన అని పాక్ స్పష్టం చేసింది. భారత్‌లో సొహైల్ పలు అంశాలు చర్చించినా జాదవ్ కేసు విషయం ప్రస్తావనకే రాలేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. గూఢచర్యం, ఉగ్రవాద చర్యల అభియోగంపై భారత్‌కు చెందిన కుల్‌భూషణ్ జాదవ్ (46)కు పాక్ సైనిక కోర్టు ఉరిశిక్ష విధించింది. దీనిపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని భారత్ ఆశ్రయించడంతో శిక్ష అమలు నిలిపివేశారు. అయితే ఈ నెల 17న పాకిస్తాన్ హైకమిషనర్ భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో సమావేశమయ్యారు. దీనిపై మీడియాలో రకరకాల కథనాలు వెలువడ్డాయి. భారత్‌లో పాకిస్తాన్ నూతన హైకమిషనర్ బాధ్యతల స్వీకారం సందర్భంగానే సుష్మాతో తమ సొహైల్ మహ్మద్ కలిశారని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీస్ జకారియా స్పష్టం చేశారు. ఇరువురి వధ్య జరిగిన సమావేశానికి ఎలాంటి ప్రాధాన్యత లేదని, మర్యాద పూర్వకంగానే సుష్మాను కలిసినట్టు ఆయన వివరణ ఇచ్చారు. ‘ద్వైపాక్షి సంబంధాలు కొనసాగించాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. ఈ చర్చల్లో ఫలానా అంశం అని ఏదీ లేదు. జాదవ్ కేసు ప్రస్తావనకే రాలేదు’ అని జకారియా పేర్కొన్నారు. సమావేశంలో భారత్ మీడియాలో వచ్చిన కథనాలు అవాస్తవమని ఆయన తెలిపారు. పైగా సుష్మా స్వరాజ్, సొహైల్ మధ్య చర్చలు సుహృద్భావ వాతావరణంలోనే సాగాయని పాక్ సంతృప్తి వ్యక్తం చేసింది.