అంతర్జాతీయం

హిందూ సంస్కృతికి ప్రతీక దీపావళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, అక్టోబర్ 21: దీపావళి పండుగ హిందువుల సంస్కృతికి ప్రతీక అని బ్రిటన్ ప్రధాని థెరిసా మే అన్నారు. జీవితంపై ప్రభావం చూపే ప్రతి అవకాశాన్ని దీపావళి అందిస్తుందని, గతంలో జరిగిన చేదు ఘటనలను మరిచిపోయి భవిష్యత్తులో ఆనందంగా జీవించే అవకాశాన్ని కల్పిస్తుందని పేర్కొన్న ఆమె దీపావళి సందర్భంగా హిందువులకు శుభాకాంక్షలు తెలియజేశారు. లండన్‌లోని ఎన్‌ఆర్‌ఐ వ్యాపారవేత్తలు హిందూజా సోదరులు ఘనంగా నిర్వహించిన దీపావళి వేడుకల సందర్భంగా థెరిసా మే పంపిన ఓ సందేశంలో పైవిధంగా పేర్కొన్నారు. ఈ వేడుకలకు హాజరైన బ్రిటన్ మంత్రి ప్రీతి పటేల్ చదివి వినిపించారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోనూ, యూరప్‌లోనూ భారతీయ హిందువులు కీలక భూమిక పోషిస్తున్నారని థెరిసా మే ఆ సందేశంలో పేర్కొన్నారు.